శేఖ‌ర్ క‌మ్ముల‌ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది?

Update: 2023-01-12 05:29 GMT
సెన్సిబుల్ మూవీస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న శేఖ‌ర్ క‌మ్ముల 2004లో తెర‌కెక్కించిన మూవీ 'ఆనంద్‌'. మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్ష‌న్ తో రూపొందిన ఈ మూవీలో రాజా హీరోగా న‌టించాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీప‌డిన ఈ మూవీ ద్వారా తెలుగు తెర‌కు బెంగాళీ సోయ‌గం క‌మ‌లినీ ముఖ‌ర్జీ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. తొలి చిత్రంతో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేయ‌డ‌మే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసింది.

ఆ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లోనే సుమంత్ న‌టించిన 'గోదావరి'లోనూ మెరిసింది. హ్యాపీడేస్‌, గ‌మ్యం, జ‌ల్సా వంటి సినిమాల్లోనూ న‌టించిన క‌మ‌లినీ ముఖ‌ర్జీ ఆ త‌రువాత త‌న క్రేజ్ త‌గ్గ‌డంతో చివ‌ర‌గా రామ్ చ‌ర‌ణ్ తో కృష్ణ‌వంశీ రూపొందించిన 'గోవిందుడు అంద‌రివాడేలే' మూవీలో శ్రీ‌కాంత్ కు జోడీగా క‌నిపించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించింది త‌క్కువ సినిమాలే అయినా న‌టిగా  గుర్తింపుని సొంతం చేసుకుంది.

తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని ద‌క్కించుకుంది. అయితే గంత కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారామె. త‌ను ఎందుకు సినిమాల నుంచి త‌ప్పుకుంది? .. ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్క‌డ వుంది అనే విష‌యాలు ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో ప్రేక్ష‌కులు కూడా క‌మ‌లిని ముఖ‌ర్జీని మ‌ర్చిపోయారు కూడా. అయితే క‌మ‌లిని ముఖ‌ర్జీ ప్ర‌స్తుతం అమెరికాలో సెటిలైంది. సినిమాల‌కు దూరంగా వుంటోంది.

గ‌త కొంత కాలంగా అమెరికాలో సెటిలైన క‌మ‌లినీ ముఖ‌ర్జీ అక్క‌డ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసింద‌ని, అక్క‌డే అనుకున్న స్థాయిలో స్థిర‌ప‌డింద‌ని తెలుస్తోంది. తాజాగా ఆమె ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి రావ‌డం, మునుప‌టి ఫిజిక్ కు భిన్నంగా కాస్త బొద్దుగా త‌ను క‌నిపిస్తుండ‌టంతో అంతా శేఖ‌ర్ క‌మ్ముల హీరోయిన్ ఏంటీ ఇలా అయింది? అని వాపోతున్నారు.

రీసెంట్ గా డ‌ల్లాస్ లో ఓ ప్రైవేట్ పార్టీ జ‌రిగింది. ఆ ఈవెంట్ లో క‌మ‌లినీ ముఖ‌ర్జీ పాల్గొని సంద‌డి చేసింది. సినిమాల్లో వుండ‌గా స్లిమ్ గా నాజూకు సుంద‌రిగా క‌నిపించి క‌నువిందు చేసిన క‌మ‌లినీ ముఖ‌ర్జీ హ‌ఠాత్తుగా డ‌ల్లాస్ పార్టీలో బొద్దుగా క‌నిపించ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏంటీ ఇలా అయిపోయింద‌ని కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News