జేమ్స్ కామెరూన్ అయితే ఏంటి: నాగవంశీ!

Update: 2023-01-16 17:30 GMT
ఏదైనా ఒక సినిమా అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. ఒక సినిమా ఒకరికి నచ్చితే మరొకరు నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని బాహాటంగా చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలుగుతూ ఉంటారు. ఆ మధ్య అవతార్ సీక్వెల్ గా వచ్చిన అవతార్ పార్ట్ 2 తనకు నచ్చలేదంటూ తెలుగు నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో జేమ్స్ కేమరూన్ లాంటి దర్శకుడు తీశాడు కనుక సినిమా ఎలా ఉన్నా ఒక మెరైన్ బయాలజీ డాక్యుమెంటరీ తీసినా ఒక అద్భుతమని, విజువల్ వండర్ అని పొగిడి తీరాలి. ఇంకేం చెప్పినా నావి ఊరుకోదు అంటూ సెటైర్లు వేశాడు.

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధమవుతున్న 'బుట్ట బొమ్మ' అనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ చేశారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూ తాజాగా రిలీజ్ అయింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఆ మధ్య జేమ్స్ కేమరూన్ చేసిన అవతార్ 2 సినిమా గురించి మీరు ట్వీట్ చేశారు. మీరు అలా ట్విట్ చేయడం వల్ల జేమ్స్ కామెరాన్ నా కార్యక్రమానికి రాను అని అనేశాడు. మీ వల్ల ఇదంతా జరిగిందంటూ సరదాగా కామెంట్ చేసింది.

అయినా మీరు అలా అనడం ఏమిటి అంటే... ఆ సినిమా నాకు నచ్చలేదని మరోసారి కామెంట్ చేశాడు వంశీ. అదేమిటి అందరూ విజువల్ గా వండర్ అంటున్నారు కదా మీకు నచ్చక పోవడం ఏంటి అని సుమ ప్రశ్నిస్తే... మూడు గంటలపాటు ఏవేవో చూపిస్తే దాన్ని విజువల్ వండర్ అనాలా? అంతసేపు చూడలేక నా కళ్ళు నొప్పులు వచ్చాయంటూ వంశీ కామెంట్ చేశాడు.

ఓహో మీ కళ్ళు నొప్పులు వచ్చాయి కాబట్టి  నచ్చలేదా అంటే అలా ఏమీ కాదని మన దగ్గర ఉన్న త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారి సినిమాలు చేస్తే అవి నచ్చలేదని వాటిని చీల్చి చెండాడే వాళ్ళు ఉంటారు. కానీ మనకు తెలియని, ఎవరో ఎక్కడి ఉండే జేమ్స్ కేమరూన్ చేసిన సినిమా నచ్చలేదంటే ఎందుకు ఇంత బాధ పడిపోతున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ.. నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

అయితే నెటిజన్లు కూడా ఏం తక్కువ తినలేదు, నాగ వంశీ మీద ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు, సరే జేమ్స్ కేమరూన్ సినిమా మీకు నచ్చలేదు అలాగే మీరు నిర్మిస్తున్న సినిమాలను నచ్చనప్పుడు ఎవరైనా కామెంట్ చేసినా అలాగే తీసుకోవాలి అని అంటున్నారు. మీరు చేసే సినిమాలు ఏమైనా అద్భుతమైన దృశ్య కావ్యాలా ఏంటి? అంటూ ఆయనని టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News