వెర్సటైల్, అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ ఎపిక్ క్లాసిక్ 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగస్టు 5న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుని ఎపిక్ క్లాసిక్ లవ్ స్టోరీ అనిపించుకుంది.
పీరియాడిక్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన తీరు, కథ, కథనాన్ని నడిపించిన వైనం పట్ల స్టార్స్, సెబ్రిటీలు సైతం ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా కీలక పాత్రల్లో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీపై నెట్టింట గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించి వుంటే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే మరి కొంత మంది మాత్రం ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్'ని చూపిస్తూ క్లాసిక్ లవ్ స్టోరీ అంటే ఇది కాదని.. క్లాసిక్ అంటే 'సీతారామం' అని, క్లాసిక్ లవ్ స్టోరీని ఎలా చేయాలో వారు చేసి చూపించారని నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 'సీతారామం' పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసి వుంటే దాని రేంజ్ మరో లెవెల్లో వుండేదని అంటున్నారు. రామ్ పాత్రలో ప్రభాస్ చక్కగా ఒదిగిపోయేవాడని, సినిమా రేంజ్ మారిపోయేదని కామెంట్ లు పెడుతున్నారు.
ఈ కామెంట్ లకు కౌంటర్లు కూడా పడుతున్నాయి. లెఫ్టినెంట్ రామ్ పాత్రకు దుల్కర్ కరెక్ట్ గా న్యాయం చేశాడని, అతను నటించడం వల్లే ఈ మూవీకి అందం వచ్చిందని, ఈ స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అయిందని, ఓ క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రశంసలు దక్కించుకుంటోందని, అదే ప్రభాస్ చేసి వుంటే తేలిపోయేదని, స్టార్ డమ్ వున్న ప్రభాస్ కు ఈ స్టోరీ సూటయ్యేది కాదని, ప్రభాస్ కు ఇప్పడు రొమాంటిక్ హీరో ఇమేజ్ లేదని, యాక్షన్ హీరో ఇమేజ్ వుందని అది ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా మారేదని కామెంట్ లు చేస్తున్నారు.
అంతే కాకుండా 'రాధేశ్యామ్' ఫలితాన్ని చూసైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్ లు చేయకుండా వుంటే మంచిదని హితవు పలుకుతున్నారట. ఇదిలా వుంటే రీసెంట్ గా విడుదలైన 'సీతారామం' మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా పయనిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.