స్టార్ హీరోలతో ఒక్క సినిమా అయినా చేయాలని, దాని ద్వారా స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ లోనూ అలాంటి డైరెక్టర్లు చాలా మందే వున్నారు. అలాంటి డైరెక్టర్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురుచూడని వారంటూ లేరు.
ఒక్క ఛాన్స్ ఇస్తారా.. ఆయనని ఓ రేంజ్ లో ప్రజెంట్ చేస్తామని ఇప్పటికీ చాలా మంది దర్శకులు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడో షాకింగ్ విషయం ఏంటంటే ఇంత క్రేజ్ వున్న పవర్ స్టార్ తో సినిమాలు చేసిన డైరెక్టర్లు మాత్రం ప్రస్తుతం ఖాలీగా వుండటం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.
గతంలో చాలా మంది నటులు, డైరెక్టర్లు మెగాస్టార్ స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తే ఈ మధ్య చాలా మంది యంగ్ హీరోలు, టాలెంటెడ్ డైరెక్టర్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. వీళ్లే కాకుండా పవర్ స్ఫూర్తితో టెక్నిషియన్స్ కూడా చాలా మంది ఈ రంగంలోకి వచ్చామని చెబుతుంటారు. కారణం పవన్ కున్న క్రేజ్, హ్యూజ్ ఫ్యాన్ బేస్. గతంలో ఆయనతో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పడు టాప్ పొజిషన్ లో వున్నారు.
కానీ గత కొన్నేళ్లుగా పవన్ కల్యాణ్ తో సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకులు మాత్రం మరో సినిమా లేక ఖాలీగా వుండటం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ తో కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) అనే డైరెక్టర్ రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి క్రేజీ మల్టీస్టారర్ కూడా. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఓ మై గాడ్' ఆధారంగా తెరకెక్కిన 'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించారు. ఆ తరువాత పవన్ తో 'కాటమరాయుడు' మూవీ చేశారు. ఇది కూడా రీమేక్ సినిమానే. తమిళ హిట్ ఫిల్మ్ 'వీరం' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీ తరువాత కిషోర్ కుమార్ పార్థసాని సినిమా చేయలేదు. ఆయన దాదాపు ఆరేళ్లుగా ఖాలీగా వుంటున్నారు. ఇక పవన్ తో గత ఏడాది బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందింది. మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. విమర్శలకుల ప్రశంసలు దక్కాయి కానీ ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆయనకు మరో సినిమా లేదు. బన్నీతో అనుకున్న 'ఐకాన్' ఆగిపోయింది. చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.
ఇక రీసెంట్ గా 'భీమ్లానాయక్'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న దర్శకుడు సాగర్ కె. చంద్ర. ఈ మూవీ విషయంలో ఈ దర్శకుడిపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మాత్రం ఇప్పటికీ ఏ హీరో ఇవ్వకపోవడం గమనార్హం. వీళ్ల తరువాత ఇప్పడు పవన్ తో లైన్ లో వున్న దర్శకులు క్రిష్, హరీష్ శంకర్. క్రిష్ 'హరి హర వీరమల్లు' చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ వరు బ్రేకులతో ముందు కు సాగుతోంది. హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' పట్టాలెక్కాల్సి వుంది.