'సలార్‌' షూటింగ్ ఏం జరుగుతోంది..!

Update: 2022-11-19 11:56 GMT
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేజీఎఫ్ సినిమా తో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసిన ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.

కేజీఎఫ్ సినిమా లో ఉన్న యాక్షన్‌ సన్నివేశాలకు రెట్టింపు యాక్షన్ ను సలార్‌ లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పెడుతున్నాడట. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో ఈ సినిమా ప్రభాస్ కు మరో పాన్ ఇండియా మూవీ గా నిలిచేలా దర్శకుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

ప్రస్తుతం షూట్‌ చేస్తున్న యాక్షన్‌ సన్నివేశాలు అదరహో అన్నట్లుగా సాగుతున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమా లో అత్యంత ఆకర్షణీయమైన సన్నివేశంలో ఈ యాక్షన్‌ సన్నివేశాలు వస్తాయి అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. ఇక కేజీఎఫ్ సినిమా లో నటించిన కొందరు నటీ నటులు కూడా ఈ సినిమా లో కనిపించబోతున్నారట. కేజీఎఫ్ ను నిర్మించిన హంబులే నిర్మాణ సంస్థ సలార్ ను నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News