'చోర్ బజార్' ప్రీ రిలీజ్ వేదికగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పూరి పై తనకున్న చనువుతో గణేష్ అలా వ్యాఖ్యానించినా..ఆ వ్యాఖ్యలు అక్కడడక్కా డా అదుపు తప్పినట్లే కనిపించింది. ఎందర్నో స్టార్లని చేసావ్..కానీ నీ కొడుకు సినిమా వేడుక వచ్చేసరికి ముంబైలో కూర్చున్నావో? నీకు ఇది న్యాయమా? నీదగ్గర ఏమీ లేనప్పుడు ఆ పిచ్చితల్లి.. మహాతల్లి నిన్ను నమ్మి వచ్చేసింది.
ఆ తర్వాత నీ చూట్టూ ఎంతో మంది చేరారు. ఇప్పుడు ర్యాంపులు..వ్యాంపులు చాలా మంది పూరి చుట్టూ తిరుగుతున్నారని ఇలా బండ్ల చేసిన కొన్ని వ్యాఖ్యలు అంతటా చర్చకు దారి తీసాయి. గణేష్ ఆ వ్యాఖ్యలు సిల్లీ గా పూరి పై ఉన్న స్నేహంతో అన్నట్లా? లేక వాటి వెనుక అంతరార్ధం ఏదైనా ఉందా? అని గుసగుస మొదలైంది.
అయితే కొద్ది రోజుల గ్యాప్ అనంతరం పూరి ఓ పాత పాడ్ కాస్ట్ ని మరోసారి షేర్ చేసి అగ్గిరాజేసారు. ''నాలుక అనే టాపిక్ మీద పూరి పెద్ద క్లాసే తీసుకున్నారు. అనవసరంగా మాట్లాడకూడదని.. దాని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పారు. మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా నాలుకని అదుపులో పెట్టుకోవాలని.. మాట్లాడటం కంటే వినడం ఎంతో ప్రయోజనాకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
అదే పాడ్ కాస్ట్ ని ఇప్పుడు పూరి యూ ట్యూబ్ లో షేర్ చేయడం తో అది బండ్ల గణేష్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే దించినట్లు ప్రచారం సాగుతోంది. సరిగ్గా పూరి షేర్ చేసిన కాసేపటికి మళ్లీ బడ్ల రంగంలోకి దిగి ఓ పోస్ట్ పెట్టారు. నటించే మనుషులున్నంత కాలం నీజాయితీగా ఉండేవాడు ఓడిపోతూనే ఉంటాడు' అంటూ ఓ కొంటేషన్ ని పోస్ట్ చేసారు.
ప్రస్తుతం ఈ రేండ్ షేర్లు నెట్టింట వైరల్ గా మారాయి. పూరి..గణేష్ ఒకరి కొకరు కౌంటర్ గానే ఇలా దిగారంటూ చర్చ సాగుతోంది. మొత్తానికి ఈ వివాదం చినిగి చినిగి గాలి వానలో మారుతుందా? ఏంటో? అంటూ సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. వివాదాలకు..ఆ తరహా వ్యాఖ్యలకు పూరి ఎప్పుడూ దూరంగా ఉంటారు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా తన సినిమా ద్వారా డైరెక్ట్ గానే చెబుతారు.
ఇంకా వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉంటే పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. ఎవరితోనూ తగాదాలకు దిగే టైపు కాదు. మరి తాజా టాపిక్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరోవైపు ఇద్దరి మధ్య సరదాగా జరుగుతోన్న సన్నివేశమని ఓ సెక్షన్ ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం పూరి ముంబైలో ఉన్నారు. విజయ్ దేవరకొండతో సినిమా తెరక్కిస్తోన్న నేపథ్యంలో ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఆ కారణంగానే పూరి తన కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన 'చోర్ బజార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేదని వినిపిస్తుంది.