వాళ్ళిద్దరి మధ్య అసలేం జరిగింది..??

Update: 2022-08-29 08:48 GMT
'లైగర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కొన్ని చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేసిన వీడీ.. 'బాయ్ కాట్ లైగర్' హ్యాష్ ట్యాగ్ పై తనదైన శైలిలో స్పందించాడు. దీనిపై ప్రముఖ ఎగ్జిబిటర్, ముంబై మరాఠా మందిర్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. VD ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే లేటెస్టుగా మనోజ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ పై విజయ్ మాట్లాడుతూ.. మా సినిమాను ఎవరు ఆపుతారు? నా చిత్రాన్ని ఆపుతారనే భయం నాకు లేదు. నేను యాక్టర్ ని కాకముందే కెరీర్ ఎలా ఉంటుందనే విషయం గురించి భయపడలేదు. ఇప్పుడు నేను యాక్టర్ ను. నాకు నా తల్లి ఆశీర్వాదం.. ప్రజలు దేవుడి అండ ఉంది. నాలో మంచి సినిమాలు అందించాలనే కసి ఉంది. ఫైర్ ఉంది. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి ఉంది. నేను ఎందుకు భయపడాలి అని అన్నారు.

అయితే విజయ్ వ్యాఖ్యలను ప్రముఖ ఎగ్జిబిటర్, ముంబైలోని ప్రఖ్యాత మరాఠా మందిర్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ మరోలా అర్థం చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీకి నువ్వు అనకొండ.. నీవు బంగారు కొండవు కాదు అని మండిపడ్డారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? అంటూ విరుచుకుపడ్డారు.

సినిమాను బాయ్ కాట్ చేస్తే చేయనివ్వండి అని మాట్లాడటం వల్ల థియేటర్ ఓనర్లకు ఇబ్బంది కలుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం పడింది. నీ మాటల్లో పొగరు అహంకారం ఉంది. వినాశకాలే విపరీత బుద్ది అంటారు. మిస్టర్ విజయ్.. నీవు చాలా దూకుడుగా పెరిగినట్టు ఉన్నావు. మీరు చూడకపోతే చూడకండి అని అనడంలో అహంకారం కనిపిస్తున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ నీ మాటలు సినిమాకు చేటు కలిగించేలా ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ గురించి నెగెటివ్ కామెంట్ చేయకు అని మనోజ్ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో విజయ్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు.

అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి మనోజ్ దేశాయ్ ని కలిశాడు. తాను ఏం మాట్లాడిందనే విషయం గురించి పూర్తి వీడియోను చూపించాడు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని వివరించాడు. దీంతో తాను ఎక్కడ పొరపాటు పడ్డాననే విషయం తెలుసుకొన్న మనోజ్ దేశాయ్ పశ్చాత్తాపపడ్డారు. విజయ్ దేవరకొండకు సారీ చెబుతూ ఓ వీడియోలో మాట్లాడారు. తాను చూసిన వీడియో తనను తప్పుదోవ పట్టించిందని.. అందుకే తాను ఆవేశంతో ఆవేదనతో విజయ్ పై అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

నేను పూర్తి వీడియో చూడలేదు.. నాకు పంపించిన క్లిప్పింగ్ చూసి చాలా కోపం వచ్చింది. అందుకే నా బిడ్డ లాంటి విజయ్ దేవరకొండపై అలా మాట్లాడాను. అందుకు సారీ చెబుతున్నాను అని మనోజ్ దేశాయ్ చెప్పాడు. ఈ సందర్భంగా మీరు సారీ చెప్పకూడదంటూ విజయ్ దేవరకొండ ఆయన కాళ్లకు మొక్కారు.

విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కోసం దుబాయ్ వెళ్తున్నాడు. హిందూస్థాన్ - పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ నా బిడ్డ లాంటి వాడు.. నీవు నిజాయితీగా కష్టపడు.. విజయం దానంతట అదే నీవెంట వస్తుంది అని మనోజ్ దేశాయ్ ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News