యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "ప్రాజెక్ట్ K" అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.
లెజండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అందాల భామ దిశా పటాని మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో సెన్సేషనల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నటించనున్నట్లు ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది.
"ప్రాజెక్ట్ కె" చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం మేకర్స్ ఇటీవల రామ్ గోపాల్ వర్మను సంప్రదించారట. స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఆర్జీవీ సైతం ఓకే చెప్పాడట. దర్శకుడు త్వరలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నారని అంటున్నాడు.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ.. గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు డైరెక్ట్ చేయడం లేదు. రిజల్ట్ గురించి పట్టించుకోకుండా నాసిరకం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఫిక్షనల్ రియాలిటీ అనే జోనర్ ను క్రియేట్ చేస్తూ తన మీద తానే "ఆర్జీవీ మిస్సింగ్" అనే సినిమా తీసుకున్నారు.
తను డైరెక్ట్ చేసిన "పవర్ స్టార్" అనే చిన్న చిత్రంలోనూ రామ్ గోపాల్ వర్మ కాసేపు కనిపించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలోనే ఒక పాత్ర చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. మరికొందరు మత్రం ఇది గాలి వార్త అయ్యుంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
"ప్రాజెక్ట్ K" సైన్స్ ఫిక్షన్ అండ్ సోషియో ఫాంటసీ జోనర్ సూపర్ హీరో మూవీ అని ప్రచారం జరుగుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సీనియర్ నిర్మాత అశ్వినదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. వచ్చే ఏడాదిలోపు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న "ప్రాజెక్ట్ K" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక బాషల్లో విడుదల చేయనున్నారు. 2024 దసరా సీజన్ లో లేదా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.