వయసంటూ వచ్చాక .. ప్రేమంటూ పుట్టాక ఎక్కడో .. ఏ సందర్భంలోనో ఓ ముద్దు పారేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ముద్దులేకపోతే ప్రేమకు పొద్దుపోదు అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. ముద్దు ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమను తెలియజేస్తుంది. ఆ ప్రేమ గాఢతకు అద్దం పడుతుంది. తెరపై నాయకా నాయికలు ముద్దుకు ప్రిపేర్ అవుతున్నారంటేనే కుర్రాళ్లలో మనసులో తుపాను మొదలవుతుంది. కళ్లు పెద్దవి చేసి .. రెప్పవేయకుండా ఆ తరహా సీన్స్ ను చూస్తుంటారు. ఇలాంటి ముద్దు ఒక్కటి చాలు .. ఇంధనంలా మారిపోయి లైఫ్ ను ముందుకు నడిపించడానికి అనిపిస్తుంది. ముద్దు ముద్ర పడని ప్రేమకు అర్థం లేదనిపిస్తుంది.
అందువల్లనే ప్రేమకథా చిత్రాలలో ముద్దు లేని సన్నివేశాలు దాదాపుగా ఉండవు .. ముద్దులేని ప్రేమ సన్నివేశాలు పండవు. సమయం .. సందర్భం .. వాతావరణం ఇవన్నీ కూడా ముద్దుకు మరింత ఊతాన్ని .. ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. వెన్నెల విరిసేటప్పుడు .. వానలు కురిసేటప్పుడు ముద్దుకు ముచ్చట పెరుగుతుంది. అది మరింత బలంగా తేనె బుగ్గలపై తేలియాడుతుంది. అలాంటి ముద్దు సీన్ ఒకటి 'లవ్ స్టోరీ'లో ఉంది. చైతూ .. సాయిపల్లవి మధ్య ఈ ముద్దు సీన్ ఉంటుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ .. హీరో బుగ్గపై చటుక్కున ఒక ముద్దిచ్చేసి పరుగందుకుంటుంది. ఆ సీన్ కోసం థియేటర్లకు పరిగెత్తుకొచ్చిన కుర్రాళ్లు చాలామందే ఉంటారు.
ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఆయన ప్రేమకథలు ఎలా ఉంటాయనేదానిపై ప్రేక్షకులకు ఒక అవగాహన .. నమ్మకం ఉన్నాయి. అలాగే చైతూ ఈ తరహా పాత్రలు బాగా చేస్తాడని తెలుసు. ఇక సాయిపల్లవి నటనలో సహజత్వం .. ఆమె డాన్స్ లోని స్పార్క్ ను ఇష్టపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లంతా చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అందువల్లనే ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పక్కన పెట్టేసి ఈ సినిమా కోసం జనం థియేటర్లకు రావడాన్ని బట్టి, ఈ సినిమా ఎంతగా వాళ్లపై ప్రభావితం చూపిందో అర్థం చేసుకోవచ్చు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోను ఈ ప్రేమకథ సందడి చేస్తోంది. సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను జరుపుకోవడమే కాకుండా, ఆ సక్సెస్ ను అభిమానులతో పంచుకోవడంలో బిజీ అయ్యారు.
తాజాగా ఒక ఇంటర్యూలో సాయిపల్లవి ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఆ సమయంలోనే ఈ సినిమాలోని ముద్దు ప్రస్తావన వచ్చింది. అందుకు సాయిపల్లవి నవ్వుతూ .. " నేను ఇంతవరకూ ఏ సినిమాలోను ముద్దు సీన్లు చేయలేదు .. ఇకపై కూడా చేయను. నేను ఒక సినిమాను అంగీకరించేటప్పుడు 'ముద్దు సీన్లు చేయను' అనే విషయాన్ని ముందుగానే చెప్పేస్తాను. ఈ సినిమాలో నేను చైతూను నిజంగా ముద్దుపెట్టుకోలేదు. అలా అనిపించేలా కెమెరా యాంగిల్ ను సెట్ చేశారంతే. నేను ముద్దు సీన్లు చేయననే విషయం శేఖర్ కమ్ములగారికి తెలుసు .. అందువలన ఆయన నన్ను ఇబ్బంది పెట్టలేదు" అని చెప్పుకొచ్చింది.
తెరపై చైతూకు సాయిపల్లవి ముద్దుపెట్టే సీన్ చూసిన కుర్రాళ్లు, 'ఆయన చేసుకున్న పుణ్యమేంటి మేం చేసుకున్న పాపమేంటి?' అనుకున్నారు. థియేటర్లో నుంచి బయటికి వచ్చినా ఆ ముద్దు వాళ్లను వెంటాడుతూనే వచ్చింది. అప్పటి నుంచి వాళ్లకి కుదురులేదు .. కునుకు లేదు. అలాంటి కుర్రాళ్లంతా ఇప్పుడు సాయిపల్లవి చెప్పిన ఈ మాట వింటే, ఉసూరుమనడం ఖాయం. ఉవ్వెత్తున లేచిన వాళ్ల ఉత్సాహం .. నీరుగారిపోవడం ఖాయం. తొండి .. మోసం అంటూ గోల చేయడం ఖాయం. సాయిపల్లవి చాలా గొప్పగా నటిస్తుందంటే ఏమో అనుకున్నాం .. ముద్దు పెట్టకుండానే .. ముద్దు పెట్టినదానికంటే ఎక్కువ కిక్కు తీసుకొచ్చేసింది అనుకోవడం ఖాయం.