కోవిడ్-19 కారణంగా మూతపడిపోయిన థియేటర్స్ ని రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల క్లోజ్ చేయబడిన థియేటర్స్ - మల్టీప్లెక్సెస్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరుచుకోమని సూచించింది. అయినా సరే థియేటర్స్ ఓపెన్ చేయడానికి.. సినిమాలు రిలీజ్ చేయడానికి ఎక్కువ శాతం ముందుకు రాలేదు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా మల్టీప్లెక్సెస్ ఓపెన్ చేసి కొత్త సినిమాలు లేకపోవడంతో పాత సినిమాలనే ప్రదర్శించారు. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళి దాకా వెయిట్ చేసి ఆ తర్వాత థియేటర్స్ అన్నీ తెరిస్తే ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీపావళి నుంచి థియేటర్స్ లో సినిమాల ప్రదర్శించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్స్ కూడా లాక్ చేసి పెట్టుకున్నారు. కానీ తెలుగు సినిమాలేవీ విడుదల తేదీలను అనౌన్స్ చేయలేదు. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీపావళి తర్వాతైనా ఆడియన్స్ లైఫ్ రిస్క్ చేసి థియేటర్స్ కి వస్తారనేది అనుమానమే అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ జనాలు సినిమా చూడటానికి వచ్చినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే షూటింగ్స్ అయిపోయి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది చూడాలి.
థియేటర్స్ మూతబడి ఉండటంతో అప్పటికే పూర్తయిన సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్న సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ కి ముందే కంప్లీటై రిలీజ్ కి రెడీ గా ఉన్న కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తూ వస్తున్నాయి. అలానే ఈ మధ్య కొన్ని సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం చేస్తున్నాయి. దీపావళి తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ రాకపోతే వసూళ్లపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ రిలీజ్ ని కాదని థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఫిలిం మేకర్స్ కి ఇబ్బదులు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు.