తెలుగు బాక్సాఫీస్ వద్ద 'ఎనిమీ' పరిస్థితి ఏంటీ?

Update: 2021-11-09 03:30 GMT
కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత మెల్ల మెల్లగా విడుదల అవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నా కూడా హిట్ అవుతున్న సినిమాలు.. మంచి వసూళ్లు దక్కించుకున్న సినిమాలు మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. ఇటీవల దీపావళి సందర్బంగా పలు సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగు బాక్సాఫీస్ వద్దకు డైరెక్ట్ సినిమా మంచి రోజులు వచ్చాయి వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ విషయాన్ని స్వయంగా మారుతి కూడా ఒప్పుకున్నాడు. ప్రేక్షకులు కోరుకున్నట్లుగా మేము ఎంటర్‌ టైన్ మెంట్ ను ఇవ్వలేక పోయామని చెప్పేశాడు. ఇక తమిళ అన్నాత్తే ను తెలుగు లో పెద్దన్నగా విడుదల చేశారు. పాతిక ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి.. సక్సెస్ అయ్యాయి. కాని ఇప్పుడు వీటిని ఎవరు చూస్తారండీ బాబు అంటూ పెద్దన్నను పక్కన పెట్టేశారు.

చాలా నమ్మకం మద్య విడుదల అయిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆ సినిమాల ప్లాప్ అనూహ్యంగా విశాల్ మరియు ఆర్యలు కలిసి నటించిన ఎనిమి సినిమాకు కలిసి వచ్చింది. తమిళంలో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్న ఎనిమికి ఇక్కడ కూడా పర్వాలేదు అనే టాక్ వచ్చింది. నార్మల్ గా అయితే విశాల్‌ సినిమాలు యావరేజ్ టాక్‌ దక్కించుకుంటే పెద్దగా వసూళ్లు నమోదు అవ్వడం కష్టం. కాని బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు ఏమీ లేకపోవడం మొత్తం మూడు విడుదల అవ్వగా ఆ రెండు అట్టప్‌ ప్లాప్ అనిపించుకోవడంతో మిగిలి ఉన్న ఒక్క సినిమా ఎనిమీ పర్వాలేదు అనే టాక్ ను దక్కించుకుంది కనుక వసూళ్లు అటు వైపు బాగానే వస్తున్నట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

దీపావళి వీక్ లో విడుదల అయిన సినిమాల్లో మెజార్టీ వసూళ్ల వాటను ఎనిమీ దక్కించుకున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్ అందుతోంది. రజినీకాంత్‌ నటించిన పెద్దన్న సినిమా మొదటి రెండు రోజులు సందడి చేసినా కూడా ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దాంతో ఎనిమీ సినిమా కు కలిసి వచ్చి వసూళ్ల పంట పండించుకుంది. తెలుగు రైట్స్ ను దక్కించుకున్న వారికి బ్రేక్ ఈవెన్‌ లభించిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విశాల్ సినిమాలు గతంలో తెలుగు లో మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. వాటితో పోల్చితే ఈ సినిమా వసూళ్లు తక్కువే అయినా కూడా దీపావళికి విడుదల అయిన ఇతర రెండు సినిమాలతో పోల్చితే మాత్రం ఎనిమీది పై చేయి అయినట్లే అంటున్నారు.



Tags:    

Similar News