విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన లైగర్ డిజాస్టర్ రిజల్ట్ మేకర్స్ ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పంపిణీదారులు- థియేటర్ యజమానులకు నష్టాలను తెచ్చిపెట్టింది. హిందీలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అయితే ఈ చిత్రాన్ని పూర్తిగా పూరి- ఛార్మి నిర్మించారు.
ఇందులో అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటించగా అతడిపై అమెరికాలో చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలోని ఈ చిత్రం కోసం దేవరకొండ తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం తారుమారైంది.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించిన లైగర్ ఇప్పుడు అనూహ్యమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమాను నిర్మించిన పూరీ జగన్నాధ్- ఛార్మీ కౌర్ లకు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. లైగర్ చిత్ర నిర్మాణంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపై అనుమానాలపై ఈడీ పూరీ- ఛార్మీలకు నోటీసులు పంపింది. లైగర్ లో కొన్ని విదేశీ పెట్టుబడులపై ఈడీకి అనుమానం వచ్చిందని .. సినిమా నిర్మాణం క్రమంలోనే కొన్ని విదేశీ లావాదేవీలు ED దృష్టికి వచ్చాయని కథనాలొచ్చాయి.
అవి అనుమానాస్పదంగా కనిపించాయి. తదుపరి విచారణకు ముందు పూరీ- ఛార్మిలను ప్రశ్నించాలని ఈడీ కోరుతోంది. ఈడీ నోటీసులపై పూరీ జగన్నాథ్- ఛార్మి ఇంకా స్పందించాల్సి ఉంది.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయిన పంపిణీదారులు నిర్మాతలు పూరి-ఛార్మిలపై ఒత్తిళ్లు తెచ్చారు. తమకు వచ్చిన నష్టంలో కొంతైనా భరించాలని వారిని కోరారు. దాంతో నష్టాల భర్తీకి అంగీకరించారు. కానీ దానిని నెరవేర్చనందున లైగర్ నిర్మాతలు బెదిరింపులను ఎదుర్కొన్నారని కథనాలొచ్చాయి. ఈ సమస్యపై న్యాయపోరాటం చేసేందుకు పూరి కోర్టుల పరిధిలో ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ సన్నివేశం ఇలా ఉండగానే తాజాగా పూరీ- ఛార్మీలకు ఈడీ సమన్లు అందడంతో ఫిలింనగర్ లో ఇది చర్చగా మారింది. లైగర్ సినిమాకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సినిమాకి భారీ మార్కెట్ చేసిన తర్వాత ఆ డబ్బు ఏమైంది? అనే కోణంలో ఈడీ దర్యాప్తు సాగిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.