రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి, చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మొహతా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్టు 25న మరి కొన్ని గంటల్లో థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది.
కరీంనగర్ నుంచి ముంబై వెళ్లిన తల్లీ కొడుకుల కథగా ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. ముంబై స్లామ్ ఏరియాలో వుంటూ ఛాయ్ వాలా ఎలా ఇండర్నేషనల్ ఫైటర్ గా ఎదిగాడనే ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన మూవీ ఇది. గత కొన్ని రోజులుగా బాయ్ కాట్ వివాదంతో వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీకి కావాల్సిన దానికి మించి బాయ్ కాట్ లైగర్ వివాదంతో పబ్లిసిటీ భారీ స్థాయిలో లభించింది.
దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో వున్నాయి. మరి కొన్ని గంటల్లో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకున్న బజ్ ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ లభించే అవకాశం వుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతున్నట్టుగా తెలిసింది. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో 'లైగర్' మూవీ గురువారం ఉదయం ఆటతో మొదలైతే హిందీలో మాత్రం అలా రిలీజ్ కావడం లేదు.
ఉత్తర భారతంలో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో వున్నా కూడా హిందీ వెర్షన్ రిలీజ్ ఆలస్యానికి కారణం ఏంటన్నది అర్థం కావడం లేదు. గురువారం రాత్రి నుంచి మాత్రమే ఈ మూవీ హిందీ వెర్షన్ షోలు పడబోతున్నాయి. ఇది 'లైగర్' టీమ్ అనుసరిస్తున్న కొత్త స్ట్రాటజీగా తెలుస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అనే తెలుస్తోంది.
ఇదిలా వుంటే ముందు నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీ మొత్తానికి అనుకున్న స్థాయిలో రికార్డు ధరలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ని పూర్తి చేసుకోవడం విశేషం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీని నైజాంలో వరంగల్ శ్రీను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్ తో పాటు మరో ఏరియాలో దిల్ రాజు విడుదల చేస్తున్నారు.