స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య వీడీడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ `RRR`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించారు. రూ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదలై పాన్ ఇండియా మూవీగా సంచలనాలు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
ఈ మూవీ తరువాత స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 50 కోట్ల వరకు అడ్వాన్స్ గా ఇచ్చారని, త్వరలో ఈ మూవీ పట్టాలెక్కబోతోందని ప్రచారం మొదలైంది. మారుతి డైరెక్షన్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందన్నారు. అయితే మారుతి తో ఈ ప్రాజెక్ట్ చేయడం సాహసం అని భావించిన దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
ఇదే సమయంలో ఆ వార్తలని నిజం చేస్తూ ప్రబాస్ - మారుతిల ప్రాజెక్ట్ అనూహ్యంగా ఇప్పడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి చేతుల్లోకి వెళ్లింది. ఇటీవలే ఆగస్టు 25న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. హారర్ థ్రిల్లర్ కథతో మారుతి ఈ మూవీని చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో డీవీవీ దానయ్య బ్యానర్ అధికారిక ట్విట్టర్ నుంచి ఆసక్తికరమైన వార్త బయటికి రావడం విశేషం.
`మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి మేమే అధికారికంగా ప్రకటిస్తాం. మా సంస్థ నిర్మించబోయే ప్రాజెక్ట్ లపై వచ్చే రూమర్ లని నమ్మకండి` అంటూ సోమవారం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ నుంచి ప్రకటన చేశారు.
ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ పై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇవ్వడానికే ఈ ప్రకటన చేశారా? .. లేక మరేదైనా కారణం వుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ నుంచి దానయ్య తప్పుకున్నారనే వార్తలకు చెక్ పెట్టాలనే ఇలా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ నుంచి ప్రకటన చేశారా? ఇంతకీ స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్ కి అర్థమేంటీ? అన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.