సినిమా రిలీజ్ అవ్వాలి.. వైవిద్యాన్ని చాటుకోవాలి.. బాగుందనే టాక్ రావాలి.. ఆ తర్వాత జ్యూరీ చూడాలి.. అవార్డు ఫైనల్ చేయాలి. ఇవన్నీ కాకుండా.. రిలీజ్ కాని చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఒకటికాదు.. మూడు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుందా చిత్రం. మరి, ఇదెలా సాధ్యమైంది? ఇంతకూ ఏంటా చిత్రం? అన్నది చూద్దాం.
మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం 'మరక్కార్'. ఈ చిత్రానికి సోమవారం ప్రకటించిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, క్యాస్టూమ్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది 'మరక్కార్'.
అయితే.. ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. కరోనా లాక్ డౌన్ సమయానికే ఈ చిత్రం పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. గతేడాది మార్చి 26న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ.. ఊహించని విధంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది.
కానీ.. అప్పటికే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి.. ఈ సినిమా 2020లో వచ్చిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ విధంగా నేషనల్ అవార్డు జ్యూరీ ఈ చిత్రాన్ని కూడా అవార్డుల రేసులో పరిగణనలోకి తీసుకుంది. ఆ విధంగా ఈ చిత్రాన్ని చూసిన జ్యూరీ మెంబర్స్.. మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. అదన్నమాట సంగతి. ఈ సినిమాను మే 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఏదేమైనా.. అవార్డులు గెలుచుకున్న తర్వాత విడుదలయ్యే సినిమా బహుశా ఇదేనేమో?!