ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ఉత్సవాల సంబరం ఆరు నెలల ముందే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి నామినేషన్ కు వెళుతుందని ఆస్కార్ గెలుచుకుంటుందని భావించిన ఆర్.ఆర్.ఆర్ అనూహ్యంగా బరి నుంచి ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ప్రపప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ ప్రేమ ప్రశంసలు అకాడెమీ అవార్డుల కంటే గొప్పవి అనడంలో అతిశయోక్తి లేదు. మన రాజమౌళి అతడి బృందం సాధించిన ఘనత ఇది.
అయితే ఆర్.ఆర్.ఆర్ ఇలా అర్థాంతరంగా బరి నుంచి వైదొలగడం చాలా మందిని వేధించింది. కొందరు పరిశ్రమ ప్రముఖులు దీనిని జీర్ణించుకోలేకపోయారు. పలువురు సెలబ్రిటీలు బహిరంగంగానే దీనిపై స్పందిస్తున్నారు. ఇంతకుముందు ప్రముఖ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వ్యాఖ్యానిస్తూ దర్శకులు ఎవరూ సినిమాలు తీసేప్పుడు అవార్డుల గురించి ఆలోచించరని తమ పని తాము చేసుకుని పోతారని జనాదరణ కావాలని ఆశిస్తారని వ్యాఖ్యానించారు.
సినిమా రిలీజయ్యాక జనాలే అవార్డుల గురించి మాట్లాడతారని కూడా అన్నారు. నిజానికి ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అదే జరిగింది. అంతకుముందు ఈ సినిమాని అవార్డుల కోసం తీస్తున్నారని ఎవరూ అనలేదు. ఊహించలేదు కూడా!
ఇప్పుడు టాప్ హీరోయిన్ కం నేషనల్ క్రష్ రష్మిక మందన్న కామెంట్ వైరల్ గా మారింది. రష్మిక ప్రస్తుతం తన కొత్త బాలీవుడ్ మూవీ గుడ్‌బై ప్రమోషన్‌లో బిజీగా ఉంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్.. నీనా గుప్తా తదితరులతో ఈ ప్రచారంలో రష్మిక అదరగొడుతోంది. మాతృమూర్తి మరణంతో కలత చెందిన కుమార్తెను పరిస్థితులతో రాజీపడేలా చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ప్రమోషన్ల మధ్య రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్.ఆర్.ఆర్ గురించి ప్రస్థావించింది. RRR ఆస్కార్స్ కోసం భారతదేశం నుంచి అధికారిక ప్రవేశం లేకపోవడంపై రష్మికను మీడియా విలేకరులు అడిగారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..
RRRకి లభించిన ప్రేమ అన్నింటికంటే చాలా పెద్దదిగా భావిస్తున్నానని చెప్పింది. నా ఉద్దేశ్యంలో సినిమా గొప్పగా ఆడింది. సెలబ్రేషన్ జరుపుకుంటోంది. అది అద్భుతం.. అని రష్మిక వ్యాఖ్యానించింది. "నా మునుపటి చిత్రం డియర్ కామ్రేడ్ దాదాపుగా ఆ లిస్ట్ లో చేరింది. వాస్తవానికి అది అసలు నామినీకి రాలేదు.." అని తన చిత్రం గురించి ఈ సందర్భానికి తగినట్టుగా గుర్తు చేసింది రష్మిక. ఆర్.ఆర్.ఆర్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రజల నుంచి ఆదరణ గురించి మాట్లాడుకోవాలి. అది ఎంతో గొప్పది అని వ్యాఖ్యానించింది.
పుష్ప సీక్వెల్ వివరాలు వెల్లడించింది. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను ..రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఆషికి 3 కోసం చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. తధికారికంగా ఖరారయ్యాక పేరును వెల్లడిస్తారు. రష్మిక మరిన్ని బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. టబు-అశిన్ తర్వాత వేగంగా కెరీర్ ని విస్తరిస్తున్న దక్షిణాది భామగా హిందీ పరిశ్రమలో రష్మిక పేరు మార్మోగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.