దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీ గత రెండున్నర నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులతో గైడ్ లైన్స్ రూపొందించి మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జూన్ 15 నుండి సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించాయి. తెలంగాణా ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే వీటిలో సగానికి పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలు మాత్రమే మొదలు పెట్టుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమాలు.. స్టార్టింగ్ స్టేజిలో ఉన్న చిన్న సినిమాలకు.. ఇంకా స్టార్ట్ అవని పెద్ద సినిమాలకు బ్రేక్ వేసినట్టయింది.
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య'.. దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్'.. ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో సినిమా.. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'.. అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్'.. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. అక్కినేని నాగచైతన్య 'లవ్ స్టోరీ' లాంటి సినిమాలు ఇప్పటికే చాలా భాగం షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు షూటింగ్స్ అనుమతి ఇవ్వడంతో ఈ సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప'.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.. బాలయ్య - బోయపాటి శ్రీను సినిమా.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలు ఇప్పట్లో షూటింగ్స్ జరుపుకోవడం కష్టమే అని చెప్పవచ్చు. వీటిలో ఒకటి రెండు షెడ్యూల్స్ జరుపుకున్న సినిమాలు ఇప్పట్లో ముందుకు కదిలే పరిస్థితి లేదు.
ఇక ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న చిన్న సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారని సమాచారం. అన్నీ బాగుంటే వచ్చే ఏడాది స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటున్నారట. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాల వలన ఒకటి రెండు షెడ్యూల్స్ లేదా ఇరవై ముప్పై శాతం షూటింగ్ జరుపుకున్న చిన్న సినిమాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. ఇకపోతే ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు మాత్రం రిలీజ్ కి రెడీ అవుతున్నాయట. ఈ సినిమాలు థియేటర్స్ రీ ఓపెన్ అయిన వెంటనే బయటకి రావాలని చూస్తున్నాయి. ఇప్పట్లో థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వను భావిస్తే ఓటిటీ లేదా ఏటీటీలో 'పే పర్ వ్యూ' పద్ధతిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.