గత కొంత కాలంగా వివాదం ఎక్కడ వుంటే అక్కడికి వెళ్లి దాన్నే తన సినిమాకు కథా వస్తువుగా మలుచుకుంటూ సినిమాలు తీస్తూ వస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇప్పడు వర్మ ప్లాన్ రివర్స్ అవుతోంది. ఎక్కడ వివాదం వుంటే అక్కడికి వెళ్లి సినిమాలు చేసే వర్మనే వివాదాలు వెతుక్కుంటూ వస్తున్నాయి అనడం కంటే వర్మ స్వయంకృత అపరాధాలే వివాదాలుగా మారి ఆయనని చుట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
తనకు నచ్చినట్టుగా సినిమాలు తీస్తూ సినిమాలు ప్రేక్షకుల కోసం కాదంటూ స్టేట్ మెంట్ లు పాస్ చేస్తున్న వర్మకు అదే స్థాయిలో షాకిస్తున్నారు ప్రేక్షకులు. తను చేసిన ప్రతీ సినిమాని రిజెక్ట్ చేస్తూ వర్మకు షాకులిస్తున్నారు. ఇదీ కాకుండా ఆయన పై వరుసగా చీటింగ్ కేసులు కూడా నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. చాలా మంది నిర్మాతలు వర్మతో సినిమాలు చేయాలని గత కొంత కాలంగా అడ్వాన్స్ లు ఇచ్చారట. అందులో కొంత మంది వర్మ తాము ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయాలని తాజాగా వెంటపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కె. శేఖర్ రాజు అనే నిర్మాత వర్మపై తాజాగా చీటింగ్ కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వర్మపై నట్టికుమార్ చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద మాటల వార్ నడిచింది. నట్టితో పెట్టుకుంటే టోటల్ గా తనకే లాస్ అని గ్రహించిన వర్మ రాజీకి రావడం.. ఇద్దరు కలిసి మా ఇద్దరి మధ్య జరిగింది అంతా తూచ్.. అంటూ స్టేట్ మెంట్ లు ఇవ్వడం తెలిసిందే. అయితే తాజాగా కె. శేఖర్ రాజు అనే ప్రొడ్యూసర్ మాత్రం ఇలా తూచ్... అనేలా కనిపించడం లేదు. వర్మకు రోడ్డుకు ఈడ్చేలా కనిపిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వర్మతో సినిమా చేయాలనే ఆలోచనతో ఆయనకు లక్షలు ఇచ్చానని. తన డబ్బులు తిరిగి ఇవ్వకుండా రోజులు గడుపుతున్నాడని కె. శేఖర్ రాజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. అంతే కాకుండా వర్మ రూపొందించిన `లడ్కీ` సినిమా రిలీజ్ ని నిలిపి వేయాలంటూ కోర్టుకు విన్నవించాడు. దీంతో శేఖర్ రాజు పిటీషన్ ని విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు `లడ్కీ` రిలీజ్ పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్మ పెద్ద ఇరకాటంలో పడిపోయాడు.
ఇదే సమయంలో శివం సెల్యూలాయిడ్స్ అధినేత ఎన్ .రవి కూడా వర్మపై కోర్టుని ఆశ్రయించారు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని భారీ మొత్తానికి వర్మ ఇచ్చారట.అయితే ఆ తరువాత తమకు చెప్పకుండానే ఈ మూవీ హిందీ ప్రదర్శన హక్కుల్ని బాలీవుడ్ సంస్థకు అమ్మేశాడని, ఆ విషయం గురించి వర్మని సంప్రదించే ప్రయత్నం చేస్తే స్పందన లేదని, దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ని కూడా సంప్రదించమని అక్కడా న్యాయం జరక్కపోవడంతో ఫైనల్ గా కోర్టుని ఆశ్రయించి `లడ్కీ` సినిమా రిలీజ్ పై స్టే తెచ్చామని శివం సెల్యూలాయిడ్స్ అధినేత ఎన్ .రవి స్పష్టం చేశాడు.