మాధ‌వ‌న్ సినిమా ప‌రిస్థితి ఏంటీ?

Update: 2022-07-02 06:36 GMT
మ్యాడీ..ఉరాఫ్ మాధ‌వ‌న్ తొలిసారి న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్‌'. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఇస్రో శాస్త్ర వేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించారు.

త‌ను చేయ‌ని త‌ప్పుకి దేశ ద్రోహి అనే ముద్ర ప‌డిన నంబి నారాయ‌ణ‌న్ జీవితంలోని చీక‌టి కోణాల‌తో పాటు అత‌న్ని దేశ ద్రోహిగా చిత్రించ‌డం వెన‌కున్న వారిని కూడా బ‌య‌ట‌పెడుతూ ఈ మూవీని రూపొందించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య జూలై 1న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుద‌లైంది.

చాలా కాలం పాటు ఈ మూవీపై రిసెర్చ్ చేసిన మాధ‌వ‌న్ ప‌ర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల వెర్ష‌న్ ల‌కు సంబంధించిన ఓ కీల‌క పాత్ర‌లో మాధ‌వ‌న్ స్నేహితుడు, హీరో సూర్య న‌టించారు. అదే పాత్ర‌ని హిందీ వెర్ష‌న్ లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షార‌క్ ఖాన్ న‌టించారు. ఈ ఇద్ద‌రి ఫేమ్ ని సినిమాకు మాధ‌వ‌న్ ఏ విష‌యంలోనూ వాడుకోకుండా జెన్యూన్ మూవీ అంటూ అన్నీ తానై ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చాడు.

సూర్య‌ని కానీ, షారుక్ ని కానీ త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కి వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఒంట‌రిగానే ఈ మూవీకి ప్రాచారం చేశాడు మాధ‌వ‌న్‌. విధి వంచ‌న‌కు బ‌లై ఓడిపోయి గెలిచిన ఓ విజేత గాథ‌గా ఈ నెల 1న విడుద‌లైన ఈ మూవీని తెర‌కెక్కించ‌డంలో మాధ‌వ‌న్ నూటికి నూరు శాతం విజ‌యం సాధించాడు. ఓ బ‌యోపిక్ త‌ర‌హాలో ఈ మూవీని చాలా నిజాయితీగా తెర‌పైకి తీసుకొచ్చాడు. కొంత మంది చేసిన కుట్ర కార‌ణంగా శ‌త్రు దేశానికి రాకెట్ ప్ర‌యోగానికి సంబంధించిన కీల‌క ప‌త్రాల‌ని ఇచ్చేశాడ‌ని నంబినారాయ‌ణ‌పై దేశ ద్రోహం కేసు బ‌నాయించ‌బ‌డింది.

దీంతో ఆయ‌న జైలు శిక్ష అనుభ‌వించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. దేశ భ‌క్తుడిని దేశ ద్రోహిగా ఎందుకు చిత్రించారు? అస‌లు దీని వెన‌క ఎవ‌రున్నారు. రాకెట్ ప్ర‌యోగం కోసం నంబి చేసిన కృషి ఏంటీ? అనే అనేవి ష‌యాల్ని ఈ సినిమాలో చాలా చ‌క్క‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు మాధ‌వ‌న్‌. నిజం చెప్పాలంటే ఇది వ్య‌వ‌య ప్ర‌యాస‌ల కోర్చి మాధ‌వ‌న్ చేసిన ఓ స‌న్సియ‌ర్ ఎఫ‌ర్ట్ అని చెప్పొచ్చు. అంత‌గా మాధ‌వ‌న్ ఈ మూవీ కోసం శ్ర‌మించారు. వార్త‌ల్లో నిలిచేలా చేశారు. విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నా సినిమా మాత్రం త‌న వ్యాఖ్య‌ల ద్వారా వార్త‌ల్లో నిలిచింది.

సినిమా లాగ్ వున్నా నంబి నారాయ‌ణ‌న్ ఎదుర్కొన్న స‌వాళ్ల‌ని చూపించ‌డానికి మాధ‌వ‌న్ చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. అది కొంత లాగ్ కు కార‌ణంగా మారింది. అంతా బాగానే వుంది.. సినిమాకు ఆవార్డులు భారీ స్థాయిలోనే ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తున్నా క‌మ‌ర్షియ‌ల్ గా నిల‌బ‌డుతుందా? అంటే క‌ష్ట‌మే. కామ‌న్ ఆడియ‌న్స్ ఈ సినిమాపై ఆస‌క్తిని చూపించ‌డం చాలా క‌ష్టం. అదే ఈ మూవీకి ప్ర‌ధాన మైన‌స్ గా మారే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News