అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనీల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు డైరెక్ట్ మూవీని అక్కడ చేస్తున్నాడు. భారీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందబోతుంది. సినిమా లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందని అంటున్నారు.
సందీప్ వంగ యానిమల్ సినిమాను 2023 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంటే సినిమా ఏ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు మరియు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జంతువు నుండి మనిషి పుట్టాడు అంటారు... ఇప్పుడు మనిషి మళ్లీ జంతువుగా మారితే ఎలా ఉంటుంది.. ఆ పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మనుషులు జంతువులుగా మారి చేసే అకృత్యాలను ఈ సినిమాలో అద్బుతంగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విభిన్న కథలతో దర్శకుడు సందీప్ వంగా చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకం ఉంది.
యానిమల్ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమా ఒకే సారి ఇన్ని భాషల్లో విడుదల అవ్వబోతుండటం మొదటి సారి. సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీ మరియు ఇంకా విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు. మనుషులు జంతువులుగా మారితే ఏం జరుగుతుంది అనేది చూడ్డానికి మరింత సమయం పట్టబోతుంది. 2023 ఆగస్టు వరకు ఆగాల్సిందే. యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను సందీప్ వంగ తీయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమా 2025 వరకు ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.