విజయ్ కు 100 కోట్లు ఇచ్చి ఏం లాభం?

Update: 2023-01-16 10:30 GMT
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకువచ్చినా కూడా అందులో తప్పకుండా ఆడియన్స్ ను కనెక్ట్ చేసే ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆయనకు స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉండడంతో కమర్షియల్ ఫార్మాట్లోనే సేఫ్ జోన్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో కొన్ని కమర్షియల్ సినిమాలు అంతగా సక్సెస్ కావడం లేదు.

ఇక దిల్ రాజు విజయ్ తో చేసిన వారసుడు సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. తమిళంలో ఈ సినిమాను మొత్తం థియేట్రికల్ హక్కులను అమ్మేసి సేఫ్ జోన్ లోకి వచ్చేసి తెలుగులో మాత్రం చాలా ఏరియాలో సొంతంగా విడుదల చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 6.4 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

మొత్తంగా అయితే వారసుడు సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 14 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. అంటే 15 కోట్ల బ్రేక్ బ్రేక్ ఈవెన్ అందుకుంటేనే లాభాల్లోకి వచ్చినట్లు. ఇక ఇప్పటివరకు వారసుడు 6.4 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది కాబట్టి ఇంకా సక్సెస్ కావాలి అంటే 8.6 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ఒక విధంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ తక్కువ స్థాయిలో చేయడం డ్యామేజ్ అయ్యింది.

విజయ్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన దిల్ రాజు ఒక్కరోజు తెలుగులో ఒక చిన్న మీటింగ్ పెట్టిన కూడా కలెక్షన్స్ ఎంతో కొంత పెరిగేవి. విజయ్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అతను కూడా ఇటువైపు కాస్త ఫోకస్ చేసినా కూడా కలెక్షన్స్ పెరుగుతాయి. కాని అతను తెలుగుపై అసలు ఎలాంటి రియాక్షన్ చూపించడం లేదు. దానికి తోడు దిల్ రాజు మిగతా వాళ్ళతో కూడా అంతగా ప్రమోషన్స్ ఏమీ చేపించలేదు. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నష్టాల్లోనే ముగిసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News