అందాల నయనతార దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే నంబర్ వన్ స్టార్ గా ఎదిగి రెండు దశాబ్ధాల కెరీర్ లో ఇప్పటికీ టాప్ స్లాట్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భామ ఈ రెండు దశాబ్ధాల కెరీర్ లో సంపాదించినది ఎంత? తన ఆస్తి విలువ ఎంత? ఏఏ కార్ లు వాడుతుంది? అన్నది ఆరా తీస్తే..
తన పేరిట ఉన్న అన్ని ఆస్తులు కార్లు విలువ కలిపి 100 కోట్ల ఆస్తి కలిగి ఉంటుందని ఓ అంచనా. ఒక్కో సినిమాకి 5-8 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి మూడు నాలుఉగ సినిమాల్లో నటిస్తూ 17ఏళ్ల ప్రయాణంలో భారీగా ఆర్జించారన్నది ఓ అంచనా. వాణిజ్య ప్రకటనలతో ఆరంభం ఆర్జించినా ఇటీవల ఈ విషయంలో కాస్త స్పీడ్ తగ్గించడంతో ఆ ఆదాయం తగ్గింది. అయితే తనకు కొన్ని ఫిక్స్ డ్ అస్సెట్స్ కూడా ఎంతో విలువైనవి ఉన్నాయి. ఖరీదైన కార్లు ఇంట్లో ఉన్నాయి.
నయనతారగా ప్రసిద్ది చెందిన డయానా మరియం కురియన్ తనదైన బహుముఖ ప్రజ్ఞతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏల్తోంది. 2018 లో మొత్తం రూ .15 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న నయన్ గత 17 ఏళ్లలో 75 కి పైగా చిత్రాల్లో నటించింది. 2003 లో జయరామ్ తో కలిసి మలయాళ చిత్రం మనస్సినక్కరేతో ఆమె తొలిసారి నాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అగ్ర నాయికగా ఎదిగింది. నయనతార కన్నడలో `సూపర్` సినిమా తో తొలిసారిగా అడుగుపెట్టింది అది ఆమె ఏకైక శాండల్ వుడ్ చిత్రంగా ఉంది.
ప్రతి హిట్ చిత్రంతో అభిమానులు నయనతారను లేడీ సూపర్ స్టార్ లేదా చిత్ర పరిశ్రమ `తలైవి`(నాయకురాలు) అని పొగడ్తలు కురిపిస్తున్నారు. నయన్ ఆన్-స్క్రీన్ వ్యవహారం లేదా ఆఫ్-స్క్రీన్ కట్టుబాట్ల రూపంలోనూ నయనతార నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
2019 నివేదిక ప్రకారం నయనతార నికర ఆస్తి విలువ సుమారు 100 కోట్లు అని వెల్లడైంది. తమిళ చిత్ర పరిశ్రమలోనే గాక సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నయన్ పేరు మార్మోగుతోంది. నయనతార తన స్వగ్రామమైన కేరళలో ఒక ఫాన్సీ ఇల్లు కలిగి ఉంది. చిత్రాలు నెట్ లో ఎప్పుడూ కనిపించలేదు. టాప్ లానెట్ లోని ఒక నివేదిక ప్రకారం,.. నయనతార కేరళలోని ఒక బంగ్లా యజమాని మాత్రమే కాదు.. ఇటీవల చెన్నైలో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది.
కార్ల విషయానికి వస్తే.. నయనతార ఖరీదైన BMW X5 యజమాని. ఈ స్వాంకీ కార్ ధర 75.21 లక్షలు. నయనతారకు ఆడి క్యూ 7 కూడా ఉంది. ఈ రోడ్ రేంజర్ అంచనా వ్యయం సుమారు రూ .80 లక్షలు.
వ్యక్తిగతంగా శింబుతో లవ్వాయణం బ్రేకప్.. ఆపై కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో విడిపోయిన తరువాత దర్శకుడు విఘ్నేష్ శివన్ తో మూడోసారి ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఈ జంట సహజీవనం హాట్ టాపిక్ గా మారుతోంది. వీరిద్దరూ తరచూ విమానాశ్రయాలలో కనిపిస్తారు. పండుగలు పుట్టినరోజులను ఒకరి కుటుంబాలతో జరుపుకుంటారు. విహారయాత్రకు అన్యదేశ గమ్యస్థానాలకు వెళతారు. ప్రస్తుతం విఘ్నేష్ తెరకెక్కిస్తున్న `కాతువాకుల రెండు కాదల్` చిత్రీకరణలో ఉంది. ఇందులో సమంతా అక్కినేని -విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నయనతార తన తదుపరి చిత్రం అన్నాథే చిత్రీకరణను తిరిగి ప్రారంభించగా చిత్రబృందంలో ఎనిమిది మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. ఇందులో రజనీకాంత్- కీర్తి సురేష్ - ప్రకాష్ రాజ్ -జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకి కోవిడ్ పరీక్షలు జరిపినా ఆయన ఈ గండం నుంచి గట్టెక్కారన్న వార్త అభిమానుల్ని కుదుటపరిచింది.