వారసుడు బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

Update: 2023-01-07 09:34 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

ముఖ్యంగా ఓవైపు వీర సింహారెడ్డి మరోవైపు వాల్తేరు వీరయ్య రెండు కూడా ఈ సినిమాకు గట్టి పోటీనే ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ ఇద్దరు లోకల్ హీరోలను తట్టుకుని విజయ్ సినిమాకు ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతవరకు బిజినెస్ చేసింది? అలాగే ఏ స్థాయిలో సక్సెస్ అయితే లాభాల్లోకి వస్తుంది అని వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం అయితే సినిమా ట్రైలర్ ను బట్టి చాలా రొటీన్ సినిమా అని ఓవర్గం వారి నుంచి ట్రోల్లింగ్ అయితే గట్టిగానే వచ్చింది. ఇక సినిమాకు పాజిటివ్ గట్టిగా ఉంటేనే రెండు సినిమాలను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఇక వారసుడు సినిమా నైజాంలో దాదా 6 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఇక సీడెడ్ ఏరియాలో రెండు కోట్ల వరకు బిజినెస్ చేసిన వారసుడు సినిమా ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 8 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు వారసుడు సినిమాను కంప్లీట్ గా అమ్మేసుకుని టేబుల్ ప్రాఫిట్ లోనే ఉన్నాడు.

ఇక సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుంది అనేది చూడాలి. మొత్తం అయితే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఒక విధంగా విజయ్ ఇప్పటివరకు తెలుగులో ఈ స్థాయిలో బిజినెస్ అయితే చేసుకున్నది లేదు. అతనికి ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి. మరి తెలుగులో విజయ్ మార్కెట్ 20 కోట్లకు చేరుతుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News