సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో లోతైన విషయాలను ప్రశ్నించే షోగా కాఫీ విత్ కరణ్ పాపులరైంది. ఈసారి ఓటీటీలో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 విశేష ఆదరణ దక్కించుకుంటోంది. టాప్ టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇప్పటికే రణవీర్ సింగ్- ఆలియా భట్.... సారా-జాన్వీ జోడీలతో ఎపిసోడ్ లు పెద్దగా వర్కవుటయ్యాయి. ఎపిసోడ్ ఎవరితో అయినా షో ఆద్యంతం శృంగారం గురించి బోయ్ ఫ్రెండ్స్.. గాళ్ ఫ్రెండ్స్ గురించి.. ఎఫైర్ల గురించి ప్రశ్నించడం కరణ్ ప్రత్యేకత. ఈ ప్రశ్నలు రక్తి కట్టిస్తున్నాయి.
ఆలియా భట్ ని రణబీర్ గురించి కరణ్ చాలా ప్రశ్నించారు. రణబీర్ కి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని అతడి మాజీ ప్రియురాళ్లతో తాను చాలా స్నేహంగా ఉంటానని కూడా ఆలియా వెల్లడించింది. రణబీర్ కి తనకు తెలియని వారితో ఎఫైర్లు ఉన్నాయని ఆలియా బహిరంగంగా వ్యాఖ్యానించింది. మాజీ బోయ్ ఫ్రెండ్ (కార్తీక్ ఆర్యన్) తో శృంగారం చేస్తావా? అంటూ జాన్వీని ప్రశ్నించగా.. వెనక్కి వెళ్లలేను! అంటూ జాన్వీ తెలివైన సమాధానం ఇచ్చింది. ఇక సారా అలీఖాన్ ని.. ఎవరిని ప్రేమిస్తారు? అంటే విజయ్ దేవరకొండ అంటూ ఎంతో క్రిప్టిక్ గా తెలివిగా జవాబిచ్చింది. డేటింగ్- బాయ్ ఫ్రెండ్స్ - వారితో సెక్స్ లైఫ్ గురించి జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్ లను కరణ్ ప్రశ్నించాడు. వీటికి యువనాయికలు దొరికిపోకుండా తెలివైన క్రిప్టిక్ జవాబులు చెప్పారు.
అయితే ఇప్పుడు సమంతతో ఎపిసోడ్ స్ట్రీమింగుకి రానుంది. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన అత్యంత ప్రాముఖ్యత ఉన్న నటిగా సమంత పేరు మార్మోగుతోంది. అందుకే ఈ వేదికపై తన వైవాహిక జీవితంలో ఘర్షణల గురించి.. నాగచైతన్యతో బ్రేకప్ గురించి.. పిల్లల్ని కనాలనే అంశం గురించి.. అలాగే మాజీ బోయ్ ఫ్రెండ్స్ గురించి కరణ్ సమంతను ప్రశ్నిస్తారని భావిస్తున్నారు.
ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కల్లోలాలపై పదే పదే ప్రశ్నలు సమంత ఎదుర్కోక తప్పదు. ఇక నాగచైతన్యతో బ్రేకప్ కి కారణమేమిటో సమంత ఇప్పటివరకూ చెప్పలేదు. కరణ్ షోలో చెప్పి ఉంటుందా? ఒకవేళ ఆన్సర్ ఇస్తే ఏమని చెప్పింది? అంటూ అభిమానుల్లో డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.
జాన్వీ.. సారా బోయ్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ గురించి చాలా తెలివైన క్రిప్టిక్ ఆన్సర్స్ ఇవ్వడం నెటిజనులకు నచ్చలేదు. దీనిపై బోలెడంత అసహనం నెటిజనుల్లో వ్యక్తమైంది. సమంత కూడా కేజేఓతో అదే తీరుగా మాట్లాడి ఉంటుందని భావిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన కాఫీ విత్ కరణ్ 07 టీజర్ లో కరణ్ తన సినిమాల్లో అందమైన వైవాహిక జీవితాలను చూపించారని కానీ బయట కేజీఎఫ్ యుద్ధంలా కాపురాలు సాగుతున్నాయని సమంత ఘాటైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి ఈ రోజుల్లో జంటల నడుమ అంత సాఫీగా ఏదీ సాగడం లేదని కూడా సమంత తన ఆవేదన వెల్లగక్కింది. ఆ చిన్న గ్లింప్స్ తోనే సామ్ తో షో ఎంత హాట్ గా ఉంటుందో అర్థమైంది. అందుకే ఇప్పుడు పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఈ షోలో సమంత ఏం చెబుతుందా? అని అక్కినేని అభిమానులు అంతే ఉత్కంఠగా ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.