బాబోయ్‌... ఆడియో రైట్స్ కు అంత మొత్తం ఏంటీ?

Update: 2021-07-02 05:31 GMT
ఈమద్య కాలంలో సినిమా మీడియం బడ్జెట్‌ తో చేస్తే కాస్త బజ్‌ క్రియేట్‌ చేయగలిగితే సినిమాకు మంచి బిజినెస్ చేయవచ్చు. పెట్టుబడికి ఖచ్చితంగా మినిమం రెట్టింపు ను దక్కించుకోగల అవకాశం ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. సినిమా కు సంబంధించి థియేట్రికల్‌ రైట్స్ మొదలుకుని పలు రైట్స్ ద్వారా కోట్లకు కోట్లు వస్తున్నాయి. పెరిగిన పోటీ కారణంగా శాటిలైట్‌ రైట్స్ తో భారీగా ఆదాయం నిర్మాతలు దక్కించుకుంటున్నారు. ఒకప్పుడు శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా వచ్చే మొత్తం కనీసం ప్రమోషన్‌ ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. కాని ఇప్పుడు మాత్రం శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తం సినిమా బడ్జెట్‌ లో సగం ఉంటుంది. ఇక ఆడియో రైట్స్ అంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు అయితేనే కోటికి అటు ఇటుగా అమ్ముడు పోయేవి. కాని ఇప్పుడు ఆడియో రైట్స్ కు కూడా భారీ మొత్తం ను పెట్టేందుకు మ్యూజిక్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

మ్యూజిక్ రంగంలో కూడా ఉన్న పోటీ కారణంగా కోట్లు కుమ్మరించేందుకు మ్యూజిక్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ 2 సినిమా ఆడియో రైట్స్ కు దక్కిన మొత్తం చూస్తే అవాక్కవ్వాల్సిందే. కన్నడ సూపర్ స్టార్‌ యశ్‌ హీరోగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచి పోయింది. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో థియేట్రికల్‌ రైట్స్ మరియు శాటిలైట్ ఓటీటీ ఇలా అన్ని రైట్స్ కు కూడా రికార్డు ధర దక్కుతోంది. తాజాగా ఆడియో రైట్స్ ను కూడా లహరి మరియు టీ సీరిస్‌ వారు సంయుక్తంగా రూ.7.2 కోట్లకు కొనుగోలు చేశారట.

మొదటి పార్ట్ లోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండవ పార్ట్‌ కేజీఎఫ్‌ లో కూడా ఆరు పాటలు ఉండి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే బీట్స్ ఉన్నాయట. అందుకే ఈ సినిమా ఆడియో రైట్స్ కు అంత భారీగా అమౌంట్ ను సదరు మ్యూజిక్ సంస్థలు కోట్‌ చేశారని టాక్ వినిపిస్తుంది. సూపర్‌ సెన్షేషనల్‌ కేజీఎఫ్‌ చిత్రం కు సీక్వెల్‌ గా రూపొందిన కేజీఎఫ్‌ 2 ఆడియో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక ఈ మొత్తం పెట్టడంలో తప్పు లేదని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం ఒక సౌత్‌ ఇండియన్ మూవీ ఆడియో కు ఇంత భారీ రేటు ఏంటి బాసు అంటున్నారు. కేజీఎఫ్‌ 2 కే ఇంత భారీగా ఆడియో రైట్స్ దక్కింతే ఆర్ ఆర్‌ ఆర్‌ కు ఖచ్చితంగా రూ.10 కోట్లు దక్కడం ఖాయం అంటున్నారు. ముందు ముందు ఆడియో రైట్స్ కు పది కోట్లు అనేది చాలా కామన్ విషయం అవుతుందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

యూట్యూబ్‌ తో పాటు ఇతర ఆడియో స్ట్రీమింగ్ యాప్ లు మరియు వెబ్‌ సైట్లలో పాటలను శ్రోతలు వింటున్నారు. ఇక రేడియో ల్లో పాటలను స్ట్రీమింగ్‌ చేయాలన్నా కూడా మ్యూజిక్‌ సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అన్ని ప్లాట్ ఫామ్ లు కూడా ఆడియో రైట్స్ తీసుకున్న వారికి కొంత మొత్తం అయినా చెల్లించాల్సి ఉంటుంది. దాంతోనే ఆడియో రైట్స్ దక్కించుకున్న వారికి భారీ గా లాభాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాటలు సూపర్‌ హిట్‌ అయితే పెట్టిన మొత్తంకు డబుల్ ఆదాయం కూడా వచ్చిన సందర్బాలు ఉన్నాయి. అందుకే కేజీఎఫ్ 2 సినిమా పాటలకు గాను సదరు మ్యూజిక్‌ సంస్థలు అంత మొత్తం పెట్టి ఉంటారు. కేజీఎఫ్ 2 సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క పాట కూడా రాలేదు. ఈ ఒప్పందంతో త్వరలోనే మొదటి పాట వస్తుందేమో చూడాలి. ఇక సినిమా దసరాకు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News