ఆమీర్ ఖాన్ సినిమా ఫ్లాప్, చిరు సినిమా ఫ్లాప్, ఇంకా చెప్పాలంటే రవి తేజ, రామ్, నితిన్ సినిమాలు ఫ్లాప్. శుక్రవారం పరమ దారుణంగా ఉన్నది అని భావిస్తున్న తరుణాన 3 సినిమాల ఫలితాలు గొప్పగా ఉన్నాయి. సీతారామం, బింబిసార, కార్తికేయ. కథనంలో, నిర్మాణంలో రాజీలేని సినిమాలు. ఫ్లాప్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన హను రాఘవపూడి అనే ఓ యువ ప్రతిభా శాలి పేరును తల్చుకుని తెలుగు సినిమాకు ఓ ఎపిక్ లవ్ స్టోరీ దొరికిందని భావించవచ్చు. మణిరత్నానికి వారసుడు దొరికాడని భావించవచ్చు.
పదేళ్ల కిందట ఇదే కుర్రాడు అందాల రాక్షసితో మంచి కథ ఒకటి వినిపించాడు. చాలా మంది ఆయన్ను గీతాంజలి సినిమా దర్శకులు మణిరత్నంతో పోల్చారు. అదే పోలిక ప్రాసలూ ప్రయాసలూ లేని సంభాషణలూ, ఆర్థ్రత నిండిన సన్నివేశాలు ఇవన్నీ ఆయన కథకు మూలం అయ్యాయి.
కథన రీతులకు తోడయ్యాయి. కానీ సినిమా పోయింది. కానీ అతని టాలెంట్ మాత్రం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అతనే అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
పెద్దగా లాజిక్కులకు పనిలేని చందమామ కథతో తీసిన బింబిసార అనూహ్య విజయం దక్కించుకుంది. కాస్త ప్రయత్నిస్తే కథనంలో లోపాలు దిద్ది ఇంకా మెరుగు పరిచే అవకాశం ఉండేది. కానీ ఎందుకనో ఆ పని మాత్రం పెట్టుకోలేదు.
అదేవిధంగా కల్యాణ్ రామ్ లో వైవిధ్య భరిత నటన సినిమాకు ప్లస్. ఏదేమైనా ఇక బాహుబలి భజన ఆపవచ్చు. కానీ కల్యాణ్ రామ్ అనే నటుడికి ఈ సినిమా ఆకలి తీర్చింది. కానీ కడుపు నిండాలంటే ఇలాంటి ప్రయత్నం మరోటి విజయవంతం కావాలి. ఇక ఆఖరుగా కార్తికేయ 2.
కార్తికేయ సీక్వెల్ వెంటనే రాకపోయినా చందు మొండేటీ చాలా విషయాలు జాగ్రత్తగా తీసుకుని కథను నడిపారన్నది కొందరు సినీ విశ్లేషకుల మాట. ఇందులో కూడా లాజిక్కులు కూడుకుని చూడాల్సిన పనేం లేదు కానీ ఆమిర్ ఖాన్ కే నిఖిల్ ఇవాళ చుక్కలు చూపించి పదిహేను వందల స్క్రీన్ల కు పైగా సినిమాను విడుదల చేయించి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వాన సృష్టించాడు. కలెక్షన్ల సునామీ సృష్టించాడు, అది కూడా నిఖిల్ వంటి చిన్న హీరోతో.