వాట్సాప్‌ మీదే పడ్డారు మనోళ్ళు

Update: 2016-02-02 19:30 GMT
అబ్బే.. ఇప్పుడు వాట్సాప్‌ ను 100 కోట్ల మంది వాడుతున్నారుగా.. ఆ మైల్‌ స్టోన్ గురించి కాదండోయ్‌. మనం చెప్పబోయే వాట్సాప్‌ కహానీలో సినిమాటిక్‌ యాంగిల్‌ ఉంది. పదండి ఓ లుక్కేద్దాం.

మొన్నామధ్య వచ్చిన ''లోఫర్'' సినిమాలో పూరి జగన్‌ తల్లి క్యారెక్టర్‌ రేవతితో పురిటి నొప్పుల బాధ గురించి ఒక డైలాగ్‌ చెప్పించాడు. బిడ్డను కనడానికి తల్లి పడే బాధ గురించి డెల్స్‌ అంటూ ఒక ఊహాజనితమైన సైంటిఫిక్‌ లెక్కలేవో చెప్పాడు పూరి. అయితే ఇది ఒక రాంగ్‌ లెక్క మనోడికి తెలియదు. ఆ విషయం పక్కనెట్టేస్తే.. అసలు ఈ పెయిన్‌ తాలూకు కొలతకు సంబంధించిన వాట్సాప్‌ మేసెజ్‌ ఒకటి ఎప్పటి నుండో చెక్కర్లు కొడుతోంది. మనోళ్లు ఆ మెసేజ్‌ చూసి ఏకంగా ఒక సీన్ చెక్కేశారు. జనవరి 1న వచ్చిన ''నేను శైలజ'' సినిమాలో కూడా ఎన్నో లవ్ కొటేషన్లు వాట్సాప్‌ నుండి ఎత్తేసిన మెసేజ్‌ లే. గత వారం రిలీజైన మస్తీజాదే సినిమాలో కూడా బోలెడన్ని బూతులు ఇలా వాట్సాప్‌ మెసేజ్‌ ల నుండి తయారుచేసినవే.

మొత్తానికి ఏదైనా కామెడీ డైలాగ్‌ అయినా.. పంచ్‌ అయినా.. ప్రేమ కొటేషన్‌ అయినా.. వాట్సాప్‌ గ్రూపుల్లో జనాలు షేర్‌ చేసే మెసేజ్‌ లు అంతగా ఉపయోగపడుతున్నాయ్‌ అనమాట.
Tags:    

Similar News