షారూక్ ఖాన్ ఇంట్లో స్నానం చేయాలని ఉంది...

Update: 2016-02-19 08:44 GMT
షారూక్ ఇంట్లో స్నానం చేయాలని ఉంది... అవును... ఇది  ఓ అభిమాని కోరిక. ఈ కోరికను ఆయన తన స్నేహితులతో చెప్పుకోలేదు... ఆ కోరిక తీర్చుకోవడానికి పెద్ద ప్లానే వేశాడు.. షారూక్ ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించి తన కోరిక తీరుకున్నాడు.
    
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌. తన కొత్త సినిమా 'ఫ్యాన్‌' ప్రమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా ఈ విషయం చెప్పుకొచ్చారు. 'మీ అభిమానులకు సంబంధించి మీకు గుర్తున్న ఓ క్రేజీ సంఘటనను చెప్పండి' అని అడిగిన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు షారుఖ్‌. ఓ రోజు తన అభిమాని ఒకరు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి.. తన ఇల్లు 'మన్నత్‌'లోకి దొంగతనంగా ప్రవేశించాడని.. తర్వాత ప్రశాంతంగా స్విమ్మింగ్‌ పూల్‌ లోకి దిగి.. స్నానం కూడా చేశాడని.. ఐతే స్విమ్మింగ్‌ పూల్‌ లో చప్పుడవుతుండటం చూసి సెక్యూరిటీ గార్డు అతణ్ని పట్టుకున్నాడని చెప్పాడు. అయితే... తొలుత అతణ్ని దొంగని అనుకున్నా అసలు సంగతి తెలిశాక అంతా అవాక్కయ్యారని చెప్పాడు.
   
'షారుఖ్‌ స్నానం చేసే చోట ఒక్కసారైనా నేను కూడా స్నానం చేయాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను' అని ఆ అభిమాని తన విచిత్రమైన కోరికను వెల్లడించడంతో అందరం నవ్వుకున్నామని షారుఖ్‌ చెప్పాడు. తాను గతంలో లక్స్‌ సోప్‌ యాడ్ లో హీరోయిన్లతో కలిసి స్నానం చేస్తున్నట్లు కనిపించానని.. తన అభిమానికి అలాంటి ఆలోచన రాకపోవడం సంతోషమని షారుఖ్‌ చమత్కరించాడు. ఆ అభిమాని చేసిన పనికి నవ్వుకుని.. అతణ్ని మన్నించి వదిలేశామని షారుఖ్‌ తెలిపాడు.
Tags:    

Similar News