భారీ యాక్షన్ బడ్జెట్ సినిమాల పై వచ్చే కామెంట్స్ సోషల్ మిడియలో ఏ విధంగా ఉంటాయో అందరికి తెలిసే ఉంటుంది. ఎవరికి వారు వారి స్టైల్ లో సినిమాల్లోని పాత్రల క్యారెక్టర్స్ తో ట్రాల్స్ వేయడం అలాగే కౌంటర్స్ మీమ్స్ ఇవ్వడం కామన్. గత కొంత కాలంగా ప్రతి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో ఈ తరహా విధానానికి నెటీజన్స్ బాగా అలవాటు పడిపోయారు. అయితే బాహుబలి ఇటీవల చైనాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇకపోతే బహుబలి తో పాటు చైనాలో అవెంజర్స్:ఇన్ఫినిటీ వార్ కూడా ఒకే సమయంలో రిలీజ్ అయ్యింది. అయితే చైనా ప్రేక్షకులు వారు రెగ్యులర్ గా వాడే వుయ్ ఛాట్ లో బాహుబలి - అవెంజర్స్ పాత్రలకు సంబంధించిన మెమెస్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. రెండు సినిమాల్లోని పాత్రలు పాత్రలు మాట్లాడుకున్నట్లు కౌంటర్లు ఇచ్చుకోవడం అక్కడ వైరల్ గా మారింది. ఓ విధంగా చెప్పాలంటే బాహుబలి కూడా ఆ స్థాయిలో పెరిగిందని చెప్పాలి. హాలీవుడ్ సినిమాలతో పోల్చడమంటే మొన్నటి వరకు మాములు విషయం కాదు అనుకునే వాళ్ళం.
కానీ ఇప్పుడు టాలెంట్ ఉన్నోడే గొప్పోడు అనే విధంగా బాహుబలి తో జక్కన్న చెప్పకనే చెప్పారు. ఇకపోతే ప్రభాస్ అవెంజర్స్ హీరోల టీమ్స్ లో భాగమయినట్లు ఫొటోలు కనిపించడం చూస్తుంటే నిజంగా అలాంటి సినిమా ఉంటే బావుండు అనిపిస్తోంది. ఇక అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ ఇండియాలో కలెక్షన్స్ ను గట్టిగా లాగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి కూడా చైనాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.