పెళ్లి ఎప్పుడని అడిగితే.. హీరోయిన్‌ బుగ్గ‌లు ఎర్ర‌బడ్డాయి..!

Update: 2021-02-05 03:30 GMT
‘బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పెళ్లి ఎప్పుడు?’ అనే చ‌ర్చ కొంత కాలంగా బీటౌన్ లో కొనసాగుతూనే ఉంది. నిజానికి.. గ‌త సంవ‌త్స‌రంలోనే పెళ్లి అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు అంద‌రూ! తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఈ అమ్మడికి ముడిపడనుందనే చర్చ జోరుగా సాగింది. కానీ.. ఆ ఊహాగానాలు నిజం కాలేదు.

తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త వీడియో చక్కర్లు కొడుతోంది. నిన్న రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న శ్రద్ధాను చుట్టుముట్టారు మీడియా ఫొటో గ్రాఫర్స్. ఆ ఫొటోగ్రాఫర్‌లలో ఒకరు పెళ్లి గురించి అడిగారు. ‘మేడం.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగారు. దీనికి ఎలాంటి సమాధానమూ చెప్పలేదు శ్రద్ధా. సిగ్గుపడుతూ వెళ్లిపోయింది.

తాను పెళ్లి చేసుకుంటున్నానని గానీ.. ఇప్పట్లో ఆ ఆలోచన లేదనిగానీ చెప్పలేదు శ్రద్ధా. దీంతో ఈ బ్యూటీ పెళ్లి వార్తలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక, సినిమాల గురించి చూస్తూ.. శ్రద్ధా ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ఢిల్లీలో ఫినిష్ అయ్యింది.




Tags:    

Similar News