స్టార్ హీరో అంటే ఎలా ఉంటారు.? సూటు, బూటు, ఖరీదైన కార్లు, కోట్లకు పడగలెత్తినట్టు ఉంటారు. అలాంటి క్యారెక్టర్లలోనే ఇప్పుడు హీరోలు నటిస్తున్నారు కూడా. కానీ మనకంటే ఎన్నో రెట్లు పాపులారిటీ, ప్రజాదరణ, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోలు ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. స్టార్ డంను పక్కనపెట్టి క్యారెక్టర్ లో ఒదిగిపోతున్నారు. ఆ పాత్రలకు జీవం పోస్తున్నారు.
ఇటీవలే బాలీవుడ్ లో వచ్చిన ‘గల్లీ బాయ్’ లాంటి సినిమా.. రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో ఒక మురికివాడ అబ్బాయిగా చేయడం చూసి దేశమే షాక్ తింది. అందుకే ఆ సినిమా గ్రాండ్ హిట్ అయ్యి వసూళ్ల వాన కురిసింది.
నిజానికి రణ్ వీర్ బాలీవుడ్ లో చాలా చాలా డిఫెరెంట్ రోల్స్ తో ముందుకెళుతున్నాడు. బాజీరావ్ మస్తానీలో ఒక పేష్వా పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత పద్మావతి మూవీలో అయితే ఏకంగా అల్లావుద్దీన్ ఖిల్జీలా విలన్ పాత్ర ధరించి బాలీవుడ్ హీరోలందరికీ షాక్ ఇచ్చాడు. అగ్రశ్రేణి హీరో క్రూరుడైన చక్రవర్తి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత సింబాతో పోలీస్ పాత్రను ఇరక్కొట్టేశాడు. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా గల్లీ బాయ్ లా మనముందుకు వచ్చాడు..
నిజానికి గల్లీ బాయ్ పాత్ర రణ్ వీర్ కు సాహసమనే చెప్పాలి. ఒక మురికవాడ.. అందులోనూ ముస్లిం కుటుంబం.. ఎన్నో కష్టాలు, కడగండ్లు, డబ్బున్న వారి నుంచి చీత్కారాలు.. నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఏం అనలేని నిస్సహాయత.. స్టార్ హీరో అయ్యిండి కూడా తండ్రి పాత్ర ధారి చేతిలో దెబ్బలు తినడం.. ఇంతటి నేచురాలిటీకి దగ్గరైన క్యారెక్టర్ ను ఏ స్టార్ హీరో కూడా చేయడానికి సాహసించడంటే అతిశయోక్తి కాదు.. కానీ రణ్ వీర్ చేశాడు. దెబ్బలు తిన్నాడు. హీరోయిజాన్ని మరిచి ఒక సాధారణ ముస్లిం యువకుడిగా.. గల్లీబాయ్ గెటప్ లో ఒదిగిపోయాడు. అదే ఇప్పుడు అతడికి అఖండ విజయాన్ని సాధించిపెట్టింది. తిరుగులేని స్టార్ ని చేసిపెట్టింది.
నిజానికి గల్లీబాయ్ లాంటి క్యారెక్టర్లు చేయడానికి అటు హిందీలో, ఇటు తెలుగులో ఏ స్టార్ హీరో కూడా చేయడానికి సాహసించడంటే అతిశయోక్తి కాదు..కానీ నేచురాలిటీకి దగ్గరగా ఉండే అలాంటి గట్స్ ఉన్న పాత్రలే ప్రేక్షకులను మెప్పిస్తాయి. హీరోల కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి. మొన్నటి రంగస్థలంలో రాంచరణ్ చేసిన పాత్ర ఇలాంటిదే.. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం చూసే ఉంటాం. అలా వినూత్న క్షేత్రస్థాయి పాత్రలు చేసేలా హీరోలు మారితే అందరికీ మంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు.