హన్సిక.. తెలుగులో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చూడగానే ముద్దుగా బొద్దుగా కనిపించే హన్సిక.. తెలుగు ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' సినిమాతో అడుగుపెట్టింది. హన్సిక అలా ఇండస్ట్రీలో కాలు పెట్టిందో లేదో.. అప్పుడే అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. దేశముదురు సినిమాలో అందమైన నటనతో.. లేలేత అందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి కొందరు కుర్రాళ్లకు కలలరాణి అని చెప్పాలి. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది హన్సిక. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. అలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే తమిళ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ రావడంతో అటు వైపు కూడా అడుగులేసింది. అమ్మడు ఎక్కడ అడుగేసినా అదృష్టమే అన్నట్లుగా హిట్ల మీద హిట్లు కొట్టింది.
అయితే గత కొంతకాలంగా హన్సిక తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా బిజీ అయిపోయింది. అడపాదడపా తెలుగులో మెరిసినా బ్యూటీ చివరి తెలుగు సినిమా 'తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి'. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న హన్సిక.. ఓ తాజా ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాలను బయట పెట్టింది. హన్సిక మాట్లాడుతూ.. "నేను చిన్నతనంలోనే ఊహ తెలియగానే నటనలో రంగప్రవేశం చేశాను. నేను నటన రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తుంది. మొదట్లో హిందీ సినిమాలలో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన నేను.. నా స్కూల్ డేస్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను సినిమాల్లో నటిస్తున్నానని నా ఫ్రెండ్స్, క్లాసుమేట్స్ నన్ను సెలబ్రిటీగా చూసేవారు. అప్పట్లో ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది. ఇంకా నా సినిమా పేమెంట్స్ విషయాలన్నీ మా అమ్మే చూసుకుంటుంది. చిన్నప్పటి నుండి నాకు కార్లంటే చాలా ఇష్టం.." అంటూ తన జ్ఞాపకాలను పంచుకుంది.