బాత్రూంలో కూర్చుని బాద్షా ఏడ్చే వేళ

Update: 2017-04-16 08:01 GMT
బాలీవుడ్ బాద్షా అని షారూక్ ఖాన్ ను అభిమానులు పిలుచుకుంటారు. ఒకప్పుడు బాక్సాఫీస్ కి బాద్షా కూడా. కానీ షారూక్ నుంచి ఆ స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఒక్క చెన్నై ఎక్స్ ప్రెస్ మినహాయిస్తే.. అభిమానులను ప్రేక్షకులను అలరించిన మూవీ మరొకటి లేదు.

షారూక్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుండడంపై.. అభిమానులు చాలానే అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇదే విషయంలో కింగ్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. తన మూవీ ఫెయిల్ అయితే.. బాత్రూంలో కూర్చుని కొన్ని గంటల పాటు ఏడుస్తుంటానని చెప్పాడు షారూక్. 'మగవాళ్లయినా.. మహిళలైనా ఏడవడంలో అంత పెద్ద తప్పేమీ లేదు. కాకపోతే. ఫెయిల్యూర్ వచ్చినపుడు ఆ బాధను అలా తీర్చేసుకుని.. తర్వాతి పనిలో పడిపోవడమే' అని చెప్పాడు షారూక్.

షారూక్ లాంటి స్టార్ హీరో ఫెయిల్యూర్స్ పై ఇలా రియాక్ట్ అవడం ఊహించని విషయమే. అయితే.. సరైన సక్సెస్ ఒక్కటి పడితే.. మళ్లీ బాక్సాఫీస్ కింగ్ గా.. కింగ్ ఖాన్ తన స్థానాన్ని చేజిక్కించుకోవడం ఖాయం అని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల కోరిక తీరేదెప్పుడో..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News