కూతురి పెళ్లికి జయను కృష్ణ రావద్దన్నాడా?

Update: 2016-12-09 06:51 GMT
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కూతురి పెళ్లికి వస్తానంటే ఏ తండ్రి అయినా వద్దు అంటాడా..? ఐతే సూపర్ స్టార్ కృష్ణ ఇలాగే చేశాడట. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జయలలిత.. ఆయన కూతురు పద్మావతి పెళ్లికి రావడానికి సిద్ధమైతే.. ఆమెను రావద్దని అన్నారట. ఐతే ఇక్కడ కృష్ణకు జయతో విభేదాలేమీ లేవు. జయలలిత ఈ పెళ్లికి హాజరవడానికి అధికారులు పెట్టిన షరతుల వల్లే కృష్ణ అలా చేయాల్సి వచ్చిందట. ఇంతకీ అప్పుడేమైందంటే..

కృష్ణ కూతురు పద్మావతి పెళ్లి చెన్నైలో జరిగిన సమయంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తనతో కలిసి ‘గూడఛారి 116’ లాంటి సూపర్ హిట్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన జయను వ్యక్తిగతంగా కలిసి తన కూతురి పెళ్లికి ఆహ్వానించాడట కృష్ణ. జయ సరే అన్నారట. ఐతే మూడు రోజుల తర్వాత జయ సెక్యూరిటీ వ్యవహరాలు చూసే అధికారి కృష్ణ వద్దకు వచ్చి.. భద్రతా కారణాల రీత్యా కళ్యాణమండపంలోని మొదటి మూడు వరుసల్ని ముఖ్యమంత్రికి.. ఆమె భద్రతా సిబ్బందికి కేటాయించాల్సి ఉంటుందని చెప్పారట.

ఐతే పెళ్లికి బంధువులతో పాటు.. అనేకమంది సినీ.. రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కానున్న నేపథ్యంలో ఇలా మూడు వరసలు జయలలిత కోసమే కేటాయించడం కష్టమని కృష్ణ అభిప్రాయపడ్డారట. అందుకే ఈ ఇబ్బంది గురించి జయలలితకు తెలియజేసి పెళ్లికి రావొద్దని సున్నితంగా విజ్నప్తి చేశారట. సరే అన్న జయలలిత పెళ్లి రోజున కృష్ణ కూతురిని ఆశీర్వదిస్తూ ఓ బొకే పంపారట.
Tags:    

Similar News