తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా నుండి వస్తున్న ఒక్కొక్క పోస్టర్ మరియు వీడియోలు సినిమా రేంజ్ ను పెంచేస్తున్నాయి. ఇటీవలే హూ ఈజ్ విక్రమాధిత్య వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా లో ప్రభాస్ జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది. అతీంద్రియ శక్తులు ఉన్న ఒక యువ జ్యోతిష్యుడి కథే ఈ సినిమా అంటూ చాలా మంది ఒక కంక్లూజన్ కు వచ్చేశారు. దాంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సినిమా గ్లిమ్స్ మరియు ఇటీవల విడుదల అయిన వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే సినిమా లోని పాటలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా తెలుగు వర్షన్ కు మరియు హిందీ వర్సన్ కు వేరు వేరు సంగీత దర్శకులు ఉంటారనే వార్తలు అప్పుడు వచ్చాయి. ఈ సినిమా పాటలు మ్యూజిక్ విషయంలో జరిగిన ప్రచారం విషయంలో ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. కాని పాటలు మాత్రం ఖచ్చితంగా సినిమా రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. సంగీత దర్శకుడు జస్టిన్ అద్బుతమైన సాంగ్స్ ను ఇస్తాడని అంతా నమ్ముతున్నారు. మొదటి పాట గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 10వ తారీకున రాధే శ్యామ్ మొదటి పాట అన్ని భాషల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలు ఈమద్య కాలంలో పాటలు అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. కనుక రాధేశ్యామ్ పాటలు కూడా ఒకే సారి అన్ని భాషల్లో వస్తాయనే అంతా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో కృష్ణం రాజు నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా పూర్తిగా 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఆ టైమ్ లోని యూరప్ ను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం దాదాపుగా వంద సెట్టింగ్ లను 85 కోట్లకు పైగా ఖర్చు చేసి వేయించారని తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఉన్న కారణంగా వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. రాధే శ్యామ్ కొత్త విడుదల తేదీ వస్తుందా లేదంటే అదే విడుదల తేదీకి సినిమా వస్తుందా అనేది చూడాలి.