ఇంటెలిజెంట్ హీరోయిన్ ని వద్దన్న దర్శకుడు

Update: 2018-10-28 14:30 GMT
మీటూ వివాదం పుణ్యమా అని ఎన్నడూ వినని చూడని కథలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఫైనల్ గా ఇవి ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయో అంతు చిక్కడం లేదు కానీ మొత్తానికైతే ఎవరూ ఊహించని వాతావరణాన్ని  సృష్టించాయి. ఈ ప్రకంపనలు సౌత్ దాకా పాకిపోయిన సంగతి తెలిసిందే. నిజ జీవితంలో కూడా జెంటిల్ మెన్ గా పేరున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150  సినిమాల తర్వాత కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ఇదిలా ఉంచితే బోల్డ్ కంటెంట్ ఉన్న  సినిమాలు చేయడం తో పాటు హాట్ బ్యూటీగా పేరున్న స్వర భాస్కర్ తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను షేర్ చేసుకుంది.

తన కొత్త సినిమా షేమ్ ముంబై ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్న సందర్భంతో డిజిటల్ మీడియాతో తన అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ దర్శకుడు స్వర భాస్కర్ ని ఆడిషన్ కోసం పిలిచాడు. టెస్ట్ లో పాస్ అయినప్పటికీ అతను స్వరను రిజెక్ట్ చేసాడు. కారణం కూడా అతనే చెప్పాడట. అందంగా ఉన్నా చాలా ఇంటెలిజెంట్ గా స్వర భాస్కర్ కనిపించడం వల్ల సినిమాకు తీసుకోలేనని చెప్పాడట. అంటే అమాయకంగా ఉండే హీరోయిన్ అయితే చెప్పినట్టు వింటుంది అవసరమైతే గెస్ట్ హౌస్ కైనా వస్తుంది అనే ఉద్దేశం కాబోలు. స్వర భాస్కర్ చెబుతోంది కూడా అదే.

కాస్టింగ్ కౌచ్ మొదలుకుని ఇప్పటి మీటూ ఉద్యమం దాకా ఇలాంటి తెరవెనుక కథలు ఎన్నో ఉన్నాయని అందరూ ధైర్యంగా ముందువస్తే సినిమా ఆడాళ్ళ అమాయకత్వాన్ని తమ లైంగిక  వాంఛల కోసం వాడుకుంటున్న  వాళ్ళ భరతం పట్టవచ్చని అంటోంది. ఇటీవలే వచ్చిన వీర్ దే వెడ్డింగ్ సక్సెస్ తో జోష్ లో ఉన్న స్వర భాస్కర్ ఇకపై వరసగా సినిమాలు చేస్తానని చెబుతోంది.
Tags:    

Similar News