సైరా అప్పటిదాకా మౌన వ్రతమే

Update: 2019-06-14 06:30 GMT
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ నెలాఖరుకే గుమ్మడికాయ కొట్టడం ఖాయం. వచ్చే జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇంకాస్త వేగవంతం చేయబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆపై చేతిలో ఉండే మూడు నెలలు దీని కోసమే డే అండ్ నైట్ పని చేయనున్నారు. సమయం మరీ ఎక్కువగా అయితే లేదు.

రెండు వందల కోట్ల బడ్జెట్. చిరంజీవి - అమితాబ్ బచ్చన్ - సుదీప్-  విజయ్ సేతుపతి లాంటి క్యాస్టింగ్ తో భారీ మల్టీ స్టారర్. వివిధ భాషల్లో విడుదల చేయాల్సిన బాధ్యత. ఓవర్సీస్ తో పాటు ఇండియా వైడ్ బిజినెస్ డీల్స్ పూర్తి చేయాలి. ఇన్ని పనుల మధ్య నిర్మాత రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సో సైరాకు ముందుంది చాలా టఫ్ టైం. అక్టోబర్ 2 విడుదల అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతానికైతే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది

ఆగస్ట్ 15 సాహో రానుంది. నిన్నటి నుంచి ప్రమోషన్ పుంజుకుంది. సాహో విడుదల దాకా సైలెంట్ గా ఉండి ఆపై చిరు బర్త్ డే ఎలాగూ అదే నెల 22న వస్తుంది కాబట్టి సైరా పబ్లిసిటీ అప్పటి నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలిసింది. సాహోని దృష్టిలో ఉంచుకునే సైరాకు సంబంధించి ఎలాంటి హైప్ తెచ్చే ప్రచారాలు చేయకండదని చరణ్ ముందే తన టీమ్ కు చెప్పాడట.

సాహో సైరాలు ఒకేసారి ప్రమోషన్ లో ఉంటే పోలికలతో అనవసర రచ్చ జరిగే అవకాశం ఉంది కాబట్టే ఇలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది. సో మెగాభిమానులు ఎంత కోరుకున్నాఆగస్ట్ మూడో వారం నుంచి మాత్రం సైరా హంగామా మొదలుకానుంది. అఫిషియల్ గా డేట్ ప్రకటించడం కూడా అప్పుడే జరుగుతుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే

  


Tags:    

Similar News