టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రతీ హీరో ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ బిజీగా గడుపుతున్నారు. పాండమిక్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ, అవి ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
RRR సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని.. తర్వాతి సినిమాని 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఏడాది క్రితమే ఈ కాంబినేషన్లు సెట్ అయ్యాయి కానీ.. ఇటీవల తారక్ పుట్టినరోజు నాడు ప్రకటించారు. అయితే బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని సాధించిన బుచ్చిబాబు.. ఎన్టీఆర్ కోసం ఓ కథ రెడీ చేసారని.. దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చాలా కాలంగా వార్తలు వినిపించాయి. ఇది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉంటుందని అన్నారు. దర్శక నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్ ను ధృవీకరించారు. బుచ్చిబాబు గురువు సుకుమార్ సైతం హింట్ ఇచ్చారు.
అయితే తారక్ బర్త్ డేకి ఈ చిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా? త్రివిక్రమ్ సినిమా మాదిరిగానే క్యాన్సిల్ చేశారా? అని అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. మరి NTR31 తర్వాత బుచ్చిబాబు మూవీ ఉంటుందేమో వేచి చూడాలి.
'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్ లకు సమయం కేటాయిస్తున్నాడు. ఈ విధంగానే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' మూవీ సెట్స్ మీద ఉంది. ఇప్పటికే పూర్తవ్వాల్సిన ఈ సినిమా ఇతర కారణాలతో లేట్ అవుతూ వస్తోంది.
ఇక హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్'మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. తాజాగా సముద్రఖని 'వినోదాయ సీతమ్' రీమేక్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. పవన్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ.. ఎప్పుడు కంప్లీట్ అవుతాయనే దానిపై స్పష్టత లేదు.
నిజానికి భీమ్లా కంటే ముందే వీరమల్లు సినిమా చేయాల్సింది. దీని తర్వాత హరీష్ - సూరి చిత్రాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కొవిడ్ పరిస్థితులు మరియు పవన్ ఇతర ప్రాధాన్యతల వల్ల ఈ లైనప్ మొత్తం మారిపోయింది. వీరమల్లు ఎప్పుడు పూర్తి చేస్తాడో అని ఆలోచిస్తుండగా.. ఇప్పుడు మరో తమిళ్ రీమేక్ ముందుకు వచ్చింది. జనసేన అధినేత క్రియాశీలక రాజకీయాలపై పూర్తిగా దృష్టిసారించాల్సి ఉండగా.. కమిటైన ప్రాజెక్ట్స్ ఎప్పటికి పూర్తవుతాయనేది తెలియడం లేదు.
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సమాయత్తం అవుతున్నారు. ఆగస్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
నిజానికి 'అల వైకుంఠపురములో' టైంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్: కనబడుటలేదు' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి 'పుష్ప' ను ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఐకాన్ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే 'పుష్ప' లేట్ అవడంతో ఎన్టీఆర్ తో మూవీ కమిట్ అయ్యారు కొరటాల.
బన్నీ లైనప్ లో బోయపాటి శ్రీను - మురుగదాస్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. 'పుష్ప 2' తర్వాత బన్నీ వీరిలో ఏ దర్శకుడితో వెళ్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో విక్రమ్ కె కుమార్ - లింగుస్వామి మాదిరిగానే ఎప్పటికీ వేచి చూడాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో అనే టాక్ వినిపిస్తోంది. దసరా కు బన్నీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికి కానీ ఐకాన్ స్టార్ తదుపరి సినిమాపై స్పష్టత రాదు.
'థాంక్యూ' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. అయితే అప్పట్లో పరశురాం దర్శకత్వంలో ఓ మూవీని మొదలు పెట్టారు చై. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడంతో ఆ సినిమాని హోల్డ్ లో పెట్టాడు పరశురాం. 'సర్కారు వారి పాట' సినిమాను పూర్తి చేశాడు.
ఇటీవల తన తదుపరి మూవీ చైతూ తోనే అని దర్శకుడు వెల్లడించారు పరశురాం. కానీ చై మాత్రం లేటెస్టుగా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ఓ బైలింగ్విల్ ను లాంచ్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ - కిశోర్ తిరుమల కూడా అక్కినేని హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు టాక్. దీంతో పరశురాం ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.