విరాట్ కోహ్లీ ఈ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. ఎందుకంటే టీం ఇండియా క్రికెట్ లో సాధిస్తున్న అద్బుత విజయాల వెనుక, ముందు ఆయనే ఉన్నాడు. అందుకే ప్రపంచ దేశాలు అన్ని కూడా విరాట్ కోహ్లీ పేరును స్మరిస్తూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మాత్రం తన పేరును మార్చుకున్నాడట. పెళ్లి చాలా ప్రైవేట్ గా జరగాలనే ఉద్దేశ్యంతో విరాట్ కోహ్లీ పేరును కాస్త రాహుల్ గా మార్చుకుని ఇటలీలో పెళ్లి చేసుకున్నాడట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ భార్య - హీరోయిన్ అనుష్క శర్మ ప్రకటించారు.
తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ ఈ కీలక విషయాన్ని చెప్పుకొచ్చింది. నాకు - విరాట్ కు పెళ్లిని భారీగా చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇటలీలో అతి తక్కువ మంది సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నాం. నా గురించి అక్కడ ఎవరికి తెలియదు. కాని కోహ్లీ పేరు అక్కడ బాగా ఫేమస్. అందుకే కోహ్లీ అనే పేరుతో పెళ్లి ఏర్పాట్లు చేస్తే మళ్లీ అక్కడ హడావుడి ఉంటుందనే ఉద్దేశ్యంతో కోహ్లీ పేరును రాహుల్ గా మార్చామని చెప్పుకొచ్చింది.
2017లో జరిగిన వీరి వివాహ వేడుకలో కేవలం 42 మాత్రమే హాజరు అయ్యారట. వారు కూడా కుటుంబంకు చెందిన అత్యంత ఆప్తులు మరియు ఆప్త మిత్రులు మాత్రమే అని అనుష్క అంది. ఇటలీలోని ట్కూస్కాని వ్యాలీలో తమ పెళ్లి జరిగిందని, పెళ్లి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచామని చెప్పుకొచ్చింది. పెళ్లి అనేది సింపుల్గా మన అనుకున్న వారి మద్య జరిగితేనే బాగుంటుందని తాము అలా చేసినట్లుగా అనుష్క పేర్కొంది. సెలబ్రెటీలు కొన్ని సార్లు వారికి వచ్చిన ఫేమ్ వల్ల ఎంతగా ఇబ్బంది పడతారో మనకు తెలుసు. ఇక కోహ్లీ తన పేరునే మార్చుకోవాల్సి వచ్చింది చూడండి.