అసలేం జరుగుతోంది కామ్రేడ్ ?

Update: 2019-04-30 10:02 GMT
మొన్న షూటింగ్ పూర్తయినట్టు విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కు సంబంధించిన అప్ డేట్ దర్శకుడు భరత్ కమ్మ స్వయంగా ఇచ్చాడు కానీ విడుదలకు సంబంధించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. గతంలో టీజర్ లో అఫీషియల్ గానే మే 31 అనౌన్స్ చేసిన టీమ్ ఇప్పుడు వెనుకడుగు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చేతిలో నెల రోజులు మాత్రమే సమయం ఉంది.

ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వలేదు. నాలుగు భాషల్లో రిలీజ్ కాబట్టి ఎక్కడికక్కడ ప్రమోషన్ విడిగా చేయాల్సిందే. సినిమా డబ్బింగ్ చేయొచ్చు కానీ వేడుకలను చేయలేరుగా. అందుకే పోస్ట్ పోన్ కాక తప్పలేదని టాక్. పైగా అదే రోజు సూర్య ఎన్జికే భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. సో డియర్ కామ్రేడ్ కు సూర్య థ్రెట్ గా నిలుస్తాడు

ఇది చాలదన్నట్టు వారం తిరక్కుండానే సల్మాన్ ఖాన్ భారత్ తో వస్తాడు. ఏ సెంటర్స్ తో పాటు మల్టీ ప్లెక్సుల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని పరిమితుల మధ్య డియర్ కామ్రేడ్ బరిలో దించి ఇబ్బందులు ఎదురుకోవడం ఎందుకని భావించిన టీం ఫైనల్ గా డేట్ మార్పుకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాని పరిణామాలు మాత్రం దాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి. రష్మిక మందన్న హీరొయిన్ గా నటించిన డియర్ కామ్రేడ్ కాలేజీ స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. బడ్జెట్ కూడా భారీగానే పెట్టడంతో బిజినెస్ పరంగా నిర్మాతల అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
    

Tags:    

Similar News