సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ వహిస్తున్న శాకుంతలం సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమా లో భరత కుమారుడి పాత్రలో కనిపించబోతుంది. అల్లు అర్హ మొదటి సారి నటించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే అల్లు అర్హ తన పాత్ర కు సంబంధించిన షూటింగ్ ను ముగించింది అంటూ కేక్ కట్ చేయించి ఆమెకు థ్యాంక్యూ చెప్పి సాగనంపాడు గునశేఖర్. ఆ తర్వాత కొన్ని రోజులకే సమంత తో కూడా కేక్ కట్ చేయించి శాకుంతలం సినిమా నుండి ఆమె పాత్ర కూడా పూర్తి అయ్యిందంటూ చెప్పుకొచ్చారు.
సమంత షూటింగ్ పూర్తి అయిన తర్వాత యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమాకు సంబంధించిన సన్నివేశాలు అన్ని కూడా ముగిశాయి అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తాజాగా హీరో దేవ్ మోహన్ తో కూడా కేక్ కట్ చేయించి వీడ్కోలు పలికారు. దుశ్యంత్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు. సాదారణంగా గుణశేఖర్ సినిమా అంటే చాలా కాలం తీస్తాడు. కాని ఈ సినిమా మాత్రం సెకండ్ వేవ్ లాక్ డౌన్ కు ముందు ప్రారంభించి.. సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత వెంటనే పూర్తి చేయడం అంటే చాలా పెద్ద విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.
శాకుంతలం సినిమా చిత్రీకరణ ముగించిన గుణశేఖర్ ఇక సినిమా ను ఎప్పుడు తీసుకు వస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి సరిగా లేదు. కరోనా కారణంగా జనాలు థియేటర్లుకు ఎక్కువ రావడం లేదు. కనుక కాస్త సమయం తీసుకుని వచ్చే ఏడాదికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని పరిస్థితులు సాఫీగా సాగి.. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సినిమాను వచ్చే సమ్మర్ కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.