2020 వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన మాస్ మహారాజ్ రవితేజ.. 2021లో విడుదలైన `క్రాక్` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం అరడజన్‌కి పైగా చిత్రాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇకపోతే ఈయన నటించిన తాజా చిత్రం `ఖిలాడి`.
రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరో అర్జున్, మురళీ శర్మ, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు, రవి వర్మ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ వదిలిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడిపోయినా చిత్ర టీమ్ ప్రమోషన్స్‌లో మాత్రం జోరు పెంచలేదు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై రవితేజ సైతం పెద్దగా ఫోకస్ చేయడం లేదు.
ఖిలాడి మూవీని ప్రమోట్ చేయడం మానేసి.. ఆయన ఇతర సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారట. దీంతో రవితేజకు ఇంత ధైర్యం ఎక్కడ్నించి వచ్చింది..? అసలు ఖిలాడి మూవీపై ఆయనకు అంత నమ్మకం ఎందుకు..? ప్రమోషన్స్‌ను నిర్లక్ష్యం చేయడం వెనక కారణం ఏంటీ..? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలు పెట్టారు. మరి దీనిపై రవితేజ ఏమంటారో చూడాలి.