చిన్నతనంలో నాన్న చేతిలో దెబ్బలు తినవారు ఉండరు. ఏదో ఒక సమయంలో తన్నులు తింటూనే ఉంటారు. కానీ అదే పెద్దయ్యాక నాన్నకు కొట్టే ధైర్యం ఉండదు. కానీ 47 ఏళ్ల వయసులోనూ ఒకాయన దెబ్బలు తిన్నాడు. అదో స్వీట్ మొమోరీస్ అంటున్నాడు.
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఎవరయ్యా అంటే అది 'అల్లు అరవింద్'నే. ఎంతో పరిణతితో సినిమాలు తీస్తూ.. కోట్లలో వ్యాపారం చేస్తూ బడా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లడమే కష్టం. కానీ ఏకంగా ఆయననే కొట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు. అతడు ఎంత పెద్ద గట్స్ ఉండేవాడు అయితే అలా కొట్టాలి. పోనీ ఆయన బావ చిరంజీవి కొట్టాడా? అంటే అదీ కాదు.. మరెవరు అల్లు అరవింద్ ను చెంపపై కొట్టిందన్నది ఇప్పుడు ఆయనే బయటపెట్టాడు అది వైరల్ అయ్యింది.
అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు దిగారు. అయితే అల్లు అరవింద్ పెళ్లి అయ్యి అంతమంది పిల్లలు అయ్యాక కూడా రామలింగయ్య బెదిరించేవాడని తాజాగా బయటపడింది. అల్లు అరవింద్ ను ఆయన తండ్రి అల్లు రామలింగయ్య 47 ఏళ్ల వయసు వచ్చాక కూడా చెంప దెబ్బ కొట్టారట.. ఈ విషయాన్ని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అల్లు అరవింద్ పంచుకున్నారు.
తెర మీద తన తండ్రి ఎప్పుడూ నవ్వులు పండిస్తూ ఉంటారు కానీ.. బేసిక్ గా ఆయన చాలా సీరియస్ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. 'మానాన్న తెరమీద నవ్విస్తారు. కానీ బయట సీరియస్ మనిషి. మానాన్నకు, అమ్మకు ఇంట్లో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. అది ప్రధానంగా ఆయన తాగుడు అలవాటు గురించే. ఒకసారి నాన్నకు, అమ్మకు ఇలాగే గొడవ జరిగింది. ఉన్నట్టుండి అమ్మ ఇంటర్ కామ్ ద్వారా మేడ మీద ఉన్న నాకు ఫోన్ చేసింది. అర్జంటుగా షర్ట్ వేసుకొని కిందకు రమ్మంది. వెళితే మీ నాన్న నాతో గొడవపడి కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా బయటకు వెళ్లిపోయాడని.. తీసుకురా అంటూ చెప్పింది.. నేను కారు తీసుకొని వెళ్తే వీధి చివరన కనిపించాడు. కారు ఎక్కమన్నాను. ఎక్కను.. ఇంట్లో అడుగుపెట్టను అని మారాం చేశాడు. ఆ తర్వాత కారెక్కాడు..
నాన్న అలా వెళ్లిపోవడంపై నాకు చాలా కోపం వచ్చి ఆ కోపాన్ని ఇంటి గేట్లోకి కారు ఎంటర్ అవుతున్న వేళ బ్రేక్ మీద చూపించి గట్టిగా సడెన్ బ్రేక్ వేశాను. దానికి నాన్న ఎగిరి ముందుకు పడ్డాడు. ఆయనకు కోపం నషాళానికి ఎక్కి వెంటనే నా చెంప చెల్లుమనిపించారు. ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది అంటూ తిట్టిపోశారు. నాకు కోపం వచ్చింది. గొడవ చేస్తే నాపై ఆయన చేయి చేసుకున్న విషయం నా భార్యకు తెలిసిపోతుందని ఊరుకున్నారు.. బయట చూస్తే ఎవరూ కనిపించలేదు.
ఇంట్లోకి వెళ్లాక కూడా ఆయనతో ఏమీ అనలేదు. అసలు విషయం తెలిస్తే నా భార్య ముందు పరువు పోతుందనుకున్నా.. కానీ రాత్రి బెడ్ రూంకు వెళ్తే 'మిమ్మల్ని మావయ్య కొట్టడాన్ని మేడ మీద వరండా నుంచి చూసి భయపడి లోపలికి వెళ్లిపోయాను..' అని మా ఆవిడ చెప్పింది. దీంతో నాకు పరువు పోయినట్టైంది.
అయినప్పటికీ నాకు నాన్న రామలింగయ్య మీద కోపం వచ్చినా అదో స్వీట్ మెమొరీగానే మిగిలిందంటూ అల్లు అరవింద్ తన నాన్నతో తనకు ఉన్న తీపిగుర్తులను పంచుకున్నాడు. 47 ఏళ్ల వయసులో నన్ను కొట్టే చనువు ఆయనకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుందని అరవింద్ గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ ప్రశ్న అడగమని అల్లు అరవింద్ భార్య నిర్మలనే చెప్పిందని అలీ కూడా తెలుపడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.