డ్యాన్సుల్లో టాలీవుడ్ మేటి హీరో ఎవరు? అంటే.. అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అటు బాలీవుడ్ కి వెళితే.. హృతిక్ రోషన్ ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ పేరు అంతే ఇదిగా వినిపిస్తుంటుంది. ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ .. బాలీవుడ్ స్టైలిష్ స్టార్ కం యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ కి ఫ్రెండు. ఇంకేం ఉంది.. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య దూరాడు లిటిల్ అల్లు అయాన్. అంతేనా టైగర్ ష్రాఫ్ తో సోషల్ మీడియాల్లో బోలెడన్ని మాట్లాడట.
ఈ చాటింగ్ లో బన్ని కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ టైగర్ కు వీరాభిమాని అట. స్టైలిష్ స్టార్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ సంగతిని చెప్పారు. తన ఇన్ స్టా పోస్ట్‌లో టైగర్ ష్రాఫ్ తో మాట్లాడుతూ...``భాఘీ సిరీస్‌పై అయాన్ ఆసక్తి పెంచుకున్నాడని... టైగర్ ష్రాఫ్‌ను `టైగర్ స్క్వాష్` అని పిలుస్తాడని బన్నీ చెప్పాడు. దానికి ఉబ్బితబ్బిబ్బయిన టైగర్ ష్రాఫ్ తన కొత్త పేరును ఎంతో ఇష్టపడుతున్నానని బన్నీకి తెలిపాడు. భాఘీ సెట్స్ కి మాత్రమే కాదు.. తన అన్ని సినిమా సెట్ లకు ఆయాన్ కి వెల్ కం చెప్పాడు. ఆ మాటను అయాన్ కి చెప్పమని బన్నీని కోరాడు టైగర్.
ఇంట్రెస్టింగ్.. అయాన్ కలిపిన మైత్రీ బంధం బావుంది కానీ.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ స్టార్ టైగర్ తో కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అయిపోవూ? హృతిక్ తో కలిసి నటిస్తే కేవలం ఉత్తరాది మార్కెట్ వరకే టైగర్ పరిమితం అవుతాడు. అదే బన్నితో కలిసి నటిస్తే అటు ఉత్తరాది ఇటు దక్షిణాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఫేమస్ స్టార్ అయిపోతాడు. మరి బన్ని- టైగర్ మల్టీస్టారర్ సాధ్యమేనా? అన్నది చూడాలి.