బాలకృష్ణ ఎవరో తెలియని తెలుగువారు ఉండడం అనేది దాదాపు అసాధ్యం. అందుకే ఈమధ్య 'బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు' అనే కామెంట్ ఎంత హాట్ టాపిక్ అయింది. ఈమధ్య ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో కమెడియన్.. వైసీపీ లీడర్ పృథ్విరాజ్ ను ఈ విషయం ఆపైన ప్రశ్నిస్తే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
"బాలకృష్ణ స్పీచులు కూడా తెలంగాణాలో ప్రజా కూటమి ఓడిపోవడానికి ప్రధాన కారణం అయ్యాయని ఈమధ్య కొందరు అంటున్నారు. అది నిజమేనంటారా?" అని అడిగితే "ఎవ్వరూ పట్టించుకోవట్లేదండీ. "ఒకాయన ఈమధ్య 'ఎవరాయన?' అన్నాడు. మరది ఆయన విజ్ఞతకే వదిలేయాలి" అన్నాడు. మరి మీకు అయన తెలుసా అని ఇంటర్వ్యూయర్ అడిగితే "ఎవరు?" అని పృథ్వి అడిగాడు. "అదే 'ఎవరాయన?' అని అడిగిన అయన" అని క్లారిటీ ఇవ్వగానే "బాలకృష్ణగారు నాకెందుకు తెలియదు? నేను అయన తోటి రెండు సినిమాల్లో యాక్ట్ చేశాను. ఎన్టీ రామారావు గారి అబ్బాయి. మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు నాకైతే తెలియదు." అన్నాడు.
ఇక కేసిఆర్ ఎందుకు గెలిచారో చెబుతూ హైదరాబాద్ లో శాంతి భద్రతలను కేసీఆర్ ప్రభుత్వం చక్కగా కాపాడుతోందని.. మహిళలకు ఎంతో సెక్యూరిటీ కల్పించిందని రాత్రిపూట కూడా మహిళలు.. ఉద్యోగినులు తమ ఆఫీసులనుండి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకుందని అన్నాడు. "24 గంటలు కరెంట్ ఉంది. ఇక షాదీ ముబారక్ పథకం..రైతుబంధు పథకం.. కేసీఆర్ కిట్స్ లాంటి మంచి పథకాలు అమలు చేస్తున్నారు. వీటివల్ల ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇవన్నీ సమాజ శ్రేయస్సుకోరి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే. ఇక వేరే పార్టీ కనుక అధికారంలోకి వస్తే గజిబిజి అవుతుంది. పదహారు మంది ఖద్దరు షర్టులు వేసుకొని ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీ గా ఉన్నారు. ఈ పదహారు మందిలో ఎవరొచ్చినా స్టెబిలిటీ ఉండదు. అందుకే ప్రజలు కేసీఆర్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు.. ఇది ప్రజా తీర్పు అన్నాడు."
Full View