పెళ్లి ఫోటోల లీక్ సీక్రెట్ ఏంటో?

Update: 2016-03-26 03:48 GMT
మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. బెంగళూరులో జరగనున్న ఈ పెళ్లికి వధూవరులకు సంబంధించిన అందరు బంధువులు హాజరు కానున్నారు. ఇందుకోసం అతిథులు అందరికీ బెంగళూరులో భారీగా విడిది ఏర్పాట్లు కూడా జరిగాయి. అలాగే శ్రీజ పెళ్లికి సంబంధించిన ప్రతీ వివరం మీడియాకు తెలుస్తోంది, ఆన్ లైన్ లో ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి.

అయితే, ఇప్పటివరకూ శ్రీజ వివాహంపై మెగాస్టార్ చిరంజీవి ఒక్కమాట కూడా అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా సరే ఈ పెళ్లికి సంబంధించిన ప్రతీ అప్డేట్ అందరికీ తెలిసిపోతోంది. ఆఖరికి చిరు ఇంట జరిగే వేడుకల ఫోటోలు కూడా ఆన్ లైన్ లో వచ్చేస్తున్నాయి. అందిరకీ వస్తున్న మెగా డౌట్ ఏంటంటే.. ఈ ఫోటోలు అసలెలా బయటకు వస్తున్నాయి అనే.  ఏదో ఒకటీ అరా పిక్చర్స్ అయితే అనుకోవచ్చు కానీ.. మరీ ఫోటోగ్రాఫర్లను పెట్టి స్పెషల్ గా తీయించినట్లు ఉన్న పిక్చర్స్ కూడా నెట్లో కనిపించడమే ఆశ్చర్యం కలిగించే విషయం.


అంటే.. ఈ ఫోటోలను ఎవరైనా ప్రత్యేకంగా లీక్ చేస్తూ అయినా ఉండాలి. లేదా వారంతట వారే అయినా లీకుల రూపంలో ఇస్తూ ఉండాలి అనుకుంటున్నారు జనాలు. అయితే పెళ్లి విషయంలో అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కాబట్టి.. శ్రీజ మ్యారేజ్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా.. మెగా క్యాంప్ అనుసరిస్తున్న ఐడియా అనే టాక్ ఉంది. మరి లీకుల సంగతి నిజమో.. చిరు క్యాంప్ కావాలనే చేస్తున్నారనే మాట నిజమో మాత్రం చెప్పడం కష్టమే.
Tags:    

Similar News