టాలీవుడ్ లో మెగా - నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. అయితే ఇదంతా సినిమాల వరకే పరిమితం. లోపల ఏమనుకుంటారో తెలియదు కానీ.. కలిసినప్పుడైతే ఇరు వర్గాలు చాలా సన్నిహితంగా ఉంటారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. కాకపోతే వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం తరచుగా సోషల్ మీడియాలో గొడవలు పడుతూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ట్యాగ్ కోసం ఫైట్ చేసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో నందమూరి అభిమానులు - మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వార్స్ జరుగుతున్నాయి. RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తర్వాత ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగాయి. సక్సెస్ క్రెడిట్ అంతా తమ హీరోకే దక్కుతుందని.. మీ హీరోది సైడ్ క్యారక్టర్ అంటూ ఒకరి పై ఒకరు విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు.
'ఆచార్య' ప్లాప్ తర్వాత.. 'బింబిసార' సినిమా హిట్ అయిన తరువాత కూడా మెగా వెర్షన్ నందమూరి మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. 'మెగాస్టార్' ట్యాగ్ ని కళ్యాణ్ రామ్ కి తగిలించి నందమూరి అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. దీనికి మెగా ఫ్యాన్స్ కూడా దీటుగా బదులిచ్చారు. ఇదే క్రమంలో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ట్యాగ్ కోసం గొడవకు దిగి నెట్టింట రచ్చ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ని 'బాస్ ఆఫ్ మాసెస్' అని మెగా ఫ్యాన్స్ పిలిస్తే.. నటసింహం బాలయ్య 'గాడ్ ఆఫ్ మాసెస్' అని నందమూరి అభిమానులు పిలుస్తూ సంబరపడుతుంటారు. కానీ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ట్యాగ్ దగ్గరకు వచ్చేసరికి తారక్ - చరణ్ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు.. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ ట్యాగ్ మెగా వారసుడు రామ్ చరణ్ లు సొంతం అని ఓ వర్గం అంటుంటే.. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు దక్కుతుందని మరో వర్గం అంటోంది. ఇటీవల 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా 'మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' గెస్టుగా రాబోతున్నాడని చిత్ర నిర్మాణ సంస్థలు పోస్టర్స్ రిలీజ్ చేయడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలో ఒకరిని ఒకరు దూషించుకుంటూ బూతులతో సోషల్ మీడియాలో ఈ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. దీంతో అసలు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ కి ఏ హీరో అర్హుడనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు మాత్రమే కాదు.. మా హీరోలు కూడా ఇందుకు అర్హులే అంటూ ఇతర ఫ్యాన్స్ హిట్లు ప్లాపులు మరియు బాక్సాఫీస్ లెక్కలు బయటకు తీస్తున్నారు.
జనాలను థియేటర్లకు రప్పించే సత్తా తమ హీరోలకు కూడా ఉందని.. ఇలానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ - అల్లు అర్జున్ - మహేష్ బాబు - రవితేజ.. ఇలా ప్రతీ హీరో అభిమాని కూడా ఎవరికి వారు తమ ఫేవరేట్ స్టారే మ్యాన్ ఆఫ్ మాసెస్ అని అంటున్నారు. మరి టాలీవుడ్ లో ప్రస్తుతమున్న హీరోలలో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ కి అర్హత కలిగిన వారెవరో కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.