ఇటు తెలుగు అటు తమిళ్ లో ఊపిరాడని రేంజ్ లో అవకాశాలతో బిజీగా ఉన్న నయనతార బయటికి చెప్పినా చెప్పకపోయినా దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న మాట వాస్తవం. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు విదేశీ యాత్రలు చేసేసిన ఈ ప్రేమ పక్షులు గ్యాప్ దొరకడం ఆలస్యం ఏదో ఒక డెస్టినేషన్ పెట్టుకుని అక్కడికి వాలిపోతూ ఉంటారు. తాజాగా అమెరికాలో లాస్ ఏంజెల్స్ కు వెళ్ళిన నయన విజ్ఞేశ్ లు అక్కడ మంచి సమయాన్నే గడిపారు.
అక్కడో చోట అందమైన అమ్మాయి అద్భుతమైన పెయింటింగ్ పక్కన నయనతార వయ్యారంగా నిలబడుతూ స్టిల్ ఇవ్వగా దాన్ని ప్రత్యేకంగా క్లిక్ మనిపించి తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు విజ్ఞేశ్. ఇంకేముంది కామెంట్లు హోరేత్తిపోతున్నాయి. మాస్టర్ పీస్ లాంటి పెయింటింగ్ పక్కన గ్లామర్ క్వీన్ నిలుచుని ఉందంటూ రకరకాలుగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నయనతార ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమా సైరా నరసింహరెడ్డి ఒక్కటే.
గత ఏడాది బాలకృష్ణతో జైసింహ చేసాక ఒప్పుకున్న మూవీ ఇదే. ఇక్కడ ఆఫర్లు వస్తున్నప్పటికీ తమిళ్ లో యమా బిజీగా ఉండటంతో చేయలేక వదులుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వెంకీ మామలో వెంకటేష్ సరసన నయన్ ని ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. లక్ష్మి-తులసి లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబినేషన్ లో గతంలో వచ్చాయి కాబట్టి సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. ఆట్లీ దర్శకత్వంలో విజయ్ సరసన కొత్త సినిమా సైన్ చేసిన నయన్ ఇంకో రెండు మూడేళ్ళ దాకా ఈ జోరు తగ్గేలా లేదు