హీరోల వల్లే నిర్ణయం మార్చుకున్న తాప్సీ

Update: 2019-06-17 09:36 GMT
ఇటీవలే విడుదలైన గేమ్ ఓవర్ ద్వారా విమర్శకుల ప్రశంశలు అందుకున్న తాప్సి అది ఇచ్చిన కిక్ తో మంచి ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో కూడా విస్తృతంగా పాల్గొన్న ఈ బ్యూటీ ఎందుకు అన్ని హీరొయిన్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తున్నారు అనే ప్రశ్నకు కొంత షాకిచ్చే సమాధానం ఇచ్చింది. గతంలో ఓ నిర్మాత తాప్సీని కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసినప్పుడు హీరో మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రెమ్యునరేషన్ తగ్గించుకుని తీసుకోమని చెప్పాడట.

దీంతో కోపం వచ్చిన తాప్సీ ఆ హీరో ఎవరి కోసమో నేనెందుకు పారితోషికం మార్చుకోవాలి అని కోప్పడి అప్పుడే ఇకపై హీరో బేస్డ్ మూవీస్ చేయకూడదు అని నిర్ణయం తీసుకుందట. అందుకే పింక్ నుంచి గేమ్ ఓవర్ అన్ని ఇవే తరహ సినిమాలు చేయడానికి కారణం అని చెబుతోంది. వాస్తవానికి ఇది ప్రతి చోటా ఉన్నదే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని హీరో సెంట్రిక్ మార్కెట్లే. వాళ్ళ ఇమేజ్ మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.

దీనికి భిన్నంగా నయనతార-అనుష్క లాంటి వాళ్ళు తమకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్నారు కాని స్టార్లతో కమర్షియల్ సినిమాలు చేయడాన్ని మానుకోలేదు. మార్కెట్ ఎల్లప్పుడు హీరొయిన్ ఆధారిత సినిమాలే రావాలని కోరుకోదు. తాప్సి చెప్పిన ప్రకారం చూస్తే అసలు ఆ నిర్మాత ఎవరో హీరో ఎవరో క్లూ దొరకడం లేదు. మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న తాప్సీ ప్రస్తుతానికి తెలుగులో ఒప్పుకున్న స్ట్రెయిట్ మూవీ ఏదీ లేదు


Tags:    

Similar News