రౌడీ స్టార్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు..?

Update: 2022-09-08 04:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన వీడీ.. రిలీజ్ తర్వాత ఎప్పుడూ లేనంత నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. దీంతో తన తదుపరి సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

'లైగర్' సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ చేసాడు విజయ్ దేవరకొండ. అయితే సుక్కూ 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేయడంతో లెక్కలన్నీ మారిపోయాయి. దీంతో శివ నిర్వాణ డైరెక్షన్ లో 'ఖుషి' సినిమాని ప్రకటించారు. అంతేకాదు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన' (JGM) అనే పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు.

విజయ్ లైనప్ చూసి కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడని భావిస్తుండగా.. ఇప్పుడు 'లైగర్' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ లెక్కలన్నీ మారిపోయాయి. 'ఖుషీ' పూర్తి చేసిన తర్వాత VD చేయబోయే సినిమా ఏంటంటే విషయంపై అందరిలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడ్డాయి.

సమంత తో కలిసి చేస్తున్న 'ఖుషి' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ వెంటనే 'జనగణమన' న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. కానీ 'లైగర్' ప్లాప్ తో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు విజయ్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనే ప్రశ్న మొదలైంది.

అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన సుకుమార్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొస్తారు అనుకోడానికి.. దర్శకుడు ఇంకా 'పుష్ప 2' షూటింగ్ మొదలు పెట్టలేదు. కొద్ది రోజుల్లో స్టార్ట్ చేసినా సుక్కూ ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఏడాదిన్నర పైనే సమయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి దాకా విజయ్ వేచి చూసే అవకాశమైతే లేదు.

ఒకవేళ సుకుమార్ కోసం వెయిట్ చేయాలన్నా.. 'పుష్ప: ది రూల్' తర్వాత దర్శకుడి ప్రాధాన్యతలు మారినా మారొచ్చు. అందుకే ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టుకోవాలని చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తో మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.

విజయ్'D తో దిల్ రాజు ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. హరీష్ కూడా స్టార్ ప్రొడ్యూసర్ తో జత కట్టాల్సి ఉంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల విజయ్ ను తన ఇంటికి లంచ్ కు ఇన్వైట్ చేసిన దిల్ రాజు.. ఈ మేరకు చర్చలు జరిపినట్లు టాక్. దీనికి రౌడీ హీరో కూడా సుముఖత వ్యక్తం చేశారట. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ ను విజయ్ దేవరకొండ సినిమాకు లాక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ను మరో ఆప్షన్ గా అనుకుంటున్నారట. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి లేదా హరీష్ దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 'ఖుషి' సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే VD తదుపరి చిత్రం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News